సింహాద్రి మీటర్‌ని దించేస్తున్న ఎన్టీఆర్

హాలీవుడ్ వాళ్ళు, ఇతర భాషల సినిమాల వాళ్ళు స్క్రీన్ ప్లే ఫార్మాట్స్‌ని ఫాలో అవుతారేమో గానీ మన తెలుగు కమర్షియల్ డైరెక్టర్స్, హీరోలు మాత్రం మీటర్‌ని ఫాలో అవుతారు. రెగ్యులర్ మాస్ మసాల సినిమాలు తీసే డైరెక్టర్స్ అందరూ కూడా స్టోరీ సిట్టింగ్స్‌ టైంలో తరచుగా మాట్లాడుకునే మాట….మీటర్‌ కరెక్ట్‌గానే ఉందా? అని. ఈ మీటర్ అంటే ఏంటనుకుంటున్నారా? స్టార్టింగ్ సీన్ ఎలా ఉండాలి? హీరో ఇంట్రడక్షన్ సీన్ ఏ నిమిషంలో రావాలి? హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఎప్పుడు ఉండాలి? ప్రి ఇంటర్వెల్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ నిమిషంలో పడాలి? అలాగే ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్‌లు ఏ టైంలో రావాలి? లాంటి విషయాలన్నింటికీ మన తెలుగు కమర్షియల్ డైరెక్టర్స్ తయారు చేసిన ఓ ఫార్మాట్ అన్నమాట. సమరసింహారెడ్డి, ఇంద్ర, సింహా, సింహాద్రి…ఇంకా బోలెడన్ని బిగ్గెస్ట్ హిట్స్, కమర్షియల్ డైరెక్టర్స్ తీసిన మీడియం బడ్జెట్ సినిమాలను అబ్జర్వ్ చేయండి. మీటర్ అంటే ఏంటో మీకే అర్థమైపోతుంది. పైన చెప్పుకున్న సీన్స్ అన్నీ కూడా ఈ రెగ్యులర్ మాస్ సినిమాలలో ఇంచుమించుగా ఒకే టైంకి వస్తూ ఉంటాయి. అలాగే ఎమోషనల్ సీన్స్‌ని ఎలా పండించాలనే విషయాల్లో కూడా మన తెలుగు డైరెక్టర్స్‌కి ఓ స్పెషల్ బుక్ ఉంది.

శ్రీమంతుడు సినిమా విషయంలో కథకు ఇంపార్టెన్స్ ఇస్తూ కొంచెం కొత్తదనం చూపించిన కొరటాల ఈ సారి మాత్రం ఎన్టీఆర్ మాస్ అభిమానులందరికీ నచ్చేలా ఉండడం కోసం సింహాద్రి మీటర్‌ని ఫాలో అయ్యాడు. సింహాద్రి సినిమాలో ‘పదిమంది బ్రతుక్కోసం నేను చావడానికైనా…ఒకరిని చంపడానికైనా నేను రెడీ’ అని చెప్పిన ఓ పెద్దాయన మాటను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న ఓ కుర్రాడు ఏం చేశాడు అన్నది కథ. ఇప్పుడు జనతా గ్యారేజ్‌లో కూడా ఓ పెద్ద మనిషి ఓ అద్భుతమైన మాట చెప్తాడు. ‘మొక్కలతో పాటు మనుషులను కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుందని….’ అనే మాటకు కనెక్ట్ అయిన ఆనంద్ అనే కుర్రాడు నెక్ట్స్ ఏం చేశాడు అనేదే కథ. సింహాద్రి ఫస్ట్ హాఫ్‌లో ఎన్టీఆర్ పనివాడుగా ఉంటాడు. ట్రెండ్ మారింది కాబట్టి జనతాలో స్టైలిష్‌గా, కాలేజ్ కుర్రాడిగా కనిపిస్తాడు.

అలాగే హీరోయిన్స్ స్కిన్ షో విషయంలో కూడా సేం మీటర్ ఫాలో అయినట్టున్నాడు. నిత్యామీనన్‌ని పద్ధతిగానే చూపిస్తూ….సింహాద్రిలో అంకిత చేసిన రచ్చకు మించి జనతాలో సమంతా చేత చేయించినట్టున్నాడు. రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ అన్నీ కూడా అదే విషయం చెప్తున్నాయి. ఇక సింహాద్రి సూపర్ హిట్టవ్వడంలో చాలా కీ రోల్ ప్లే చేసిందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు చెప్పిన మాస్ మసాలా ఐటెం సాంగ్‌ని కూడా కొరటాల యాజ్ ఇట్ ఈజ్‌గా దించేస్తున్నాడు. సేం టు సేం ధాబా సెట్. కాకపోతే రమ్యకృష్ణ ప్లేస్‌లో కాజల్ అగర్వాల్ కనిపిస్తుంది.

తెలుగు మాస్ మసాలా డైరెక్టర్స్‌తో పాటు కొత్తగా ట్రై చేసే డైరెక్టర్స్ కూడా రెగ్యులర్‌గా ఓ మాట చెప్తూ ఉంటారు. ‘మాస్ మసాల సినిమాని కరెక్ట్ మీటర్‌లో తియ్యాలే గానీ బాక్స్ ఆఫీస్ మోత మోగిపోద్ది’ అని. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు జనతా గ్యారేజ్‌కి జనాలందరూ మెచ్చే ఓ యూనివర్సల్ పాయింట్‌ని కూడా యాడ్ చేశాడు కొరటాల. మరి మీటర్ కరెక్ట్‌గానే సెట్ అయిందా? లేదా? అన్న విషయం తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 1 వరకూ వెయిట్ చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close