‘ఎమ్మెల్యే’ ఎన్టీఆర్…

ఎన్టీఆర్‌ని ఎమ్మెల్యేగా చూపించాలనుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఆల్రెడీ యంగ్ టైగర్‌తో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా తీశాడీ దర్శకుడు. దీనికి దిల్ రాజు నిర్మాత. కానీ, అంతకు ముందు ఎన్టీఆర్ కోసం హరీష్ మరో కథను రాశాడట. దర్శకుడిగా తొలి సినిమా ‘షాక్’ ప్లాప్ తర్వాత నిర్మాత నల్లమలుపు బుజ్జి ‘శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్’ ఆఫీసులో ఆ కథపై రెండేళ్లు కసరత్తులు గట్రా చేశానని ‘టచ్ చేసి చూడు’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో హరీష్ చెప్పాడు. ఎమ్మెల్యేకి ఆయన ఇచ్చిన కాప్షన్ ‘మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి’. సేమ్ టు సేమ్ ఇదే టైటిల్ అండ్ కాప్షన్‌తో జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తీస్తున్న ఈ సినిమాకి భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మాతలు. అప్పట్లో రెండేళ్లు కథపై వర్క చేసిన సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని హరీష్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆయన మాటలను బట్టి ఎన్టీఆర్‌కి కథ నచ్చలేదని తెలుస్తోంది. అందుకే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి (‘ఎమ్మెల్యే’) ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇటీవల ఇండస్ట్రీలో ఒక హీరో వద్దన్న కథతో మరొక హీరో సినిమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో హరీష్ ఆ కథను మరొకరి దగ్గరకు తీసుకెళ్లారో? లేదో? ఆ కథ ఏమైందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.