ఇజంలో…. ఎన్టీఆర్‌??

క‌ష్ట‌కాలంలో ఉన్న‌ అన్న‌య్య క‌ల్యాణ్‌రామ్ ని ఆదుకోవ‌డానికి త‌మ్ముడు ఎన్టీఆర్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. కిక్ 2 స‌మ‌యంలో క‌ల్యాణ్‌రామ్‌ని ఎన్టీఆర్ ఆర్థికంగా ఆదుకొన్నాడ‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి కూడా ఒప్పుకొన్నాడు. అంతేకాదు.. అన్న‌య్య న‌టిస్తున్న ఇజం సినిమాకీ ఇదోధికంగా స‌హాయం చేయ‌డానికి ముందుకొస్తున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఇజం. క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. పూరిపై న‌మ్మ‌కంతో ఈసినిమాపై కోట్లు ధార‌బోశాడు క‌ల్యాణ్ రామ్‌. టీజ‌ర్‌తో కాస్త బ‌జ్ కూడా వ‌చ్చింది. దాన్ని కాపాడుకోవ‌డానికి ఇప్పుడు ఎన్టీఆర్‌ని రంగంలోకి దించాల‌నుకొంటున్నాడు పూరి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ని వాడుకోవాల‌ని పెద్ద స్కెచ్చే వేస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఓ కామియో చేయించాల‌ని పూరి ఫిక్స‌య్యాడ‌ట‌. క‌ల్యాణ్ రామ్ – ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌పై జాయింటుగా ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు. ఎన్టీఆర్ ఇజంలో క‌నిపిస్తే ఈ సినిమాకి భీక‌ర‌మైన మైలేజీ రావ‌డం ఖాయం. ఓ పాట‌లో ఎన్టీఆర్ క‌నిపిస్తే బాగుంటుంద‌న్న‌ది క‌ల్యాణ్‌రామ్‌, పూరిల ఆలోచ‌న‌. దానికి ఎన్టీఆర్ కూడా సై అన్నాడ‌ని టాక్‌. ఎన్టీఆర్ః – పూరి సినిమా మొద‌ల‌వ్వ‌డానికి ఇంకా టైమ్ ఉంది. కాబ‌ట్టి.. ఈలోగా ఎన్టీఆర్ ఖాళీనే. అందుకే అన్న‌య్య కోసం కెమెరా ముందుకు రావ‌డానికి ఎన్టీఆర్ సిద్ద‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ పాట‌కు స్కోప్ లేక‌పోయినా.. వాయిస్ ఓవ‌ర్‌తోనో, గెస్ట్ అప్పీరియ‌న్స్‌తోనూ ఎన్టీఆర్‌ని వాడుకోవాల‌ని చూస్తున్నాడు పూరి. అన్నీ ఒకే అయితే… ఇజంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close