జ‌న‌తా గ్యారేజ్ @ 12.5 కోట్లు

టాలీవుడ్‌లో అంద‌రి క‌ళ్లూ… జ‌న‌తా గ్యారేజ్ పైనే. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో సినిమాల‌తో ఫామ్ లోకి వ‌చ్చిన ఎన్టీఆర్‌… శ్రీ‌మంతుడుతో బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన కొర‌టాల శివ‌తో జోడీ క‌ట్ట‌గానే… అంద‌రి ఫోక‌స్ ఈ సినిమాపై ప‌డింది. దానికి తోడు జ‌న‌తా గ్యారేజ్ అనే టైటిల్‌, మోహ‌న్‌లాల్ లాంటి ఆర్టిస్టుల అండ దొర‌క‌డం, ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌… యూ ట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టించ‌డం వెర‌సి.. జ‌న‌తా గ్యారేజ్‌పై హైప్ పెరిగిపోంతోంది. దాంతో బయ్య‌ర్లు ఈ సినిమా కోసం క్యూ క‌ట్ట‌డం మొద‌లెట్టారు. ఇప్పుడు శాటిలైట్ రేటు కూడా అదిరిపోయింది. మా టీవీ జ‌న‌తా గ్యారేజ్ శాటిలైట్ హ‌క్కుల్ని రూ.12.5 కోట్ల‌కు జేజిక్కించుకొన్న‌ట్టు టాక్‌. ఎన్టీఆర్ కెరీర్‌లో శాటిలైట్‌కి ఈ స్థాయిలో ధ‌ర ప‌ల‌క‌డం ఇదే తొలిసారి. దీన్ని బ‌ట్టి జ‌న‌తా గ్యారేజ్ హైప్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవొచ్చు. నైజాం రేటుకూడా భారీగానే ప‌లికింది. ఎన్టీఆర్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ ధ‌ర అది. ఇలా అన్ని వైపుల నుంచీ.. ఈసినిమాకి మంచి రేటే వ‌స్తోంది. జ‌న‌తా గ్యారేజీ సినిమాకి బ‌డ్జెట్ పెరిగిపోయింద‌ని, ఎన్టీఆర్ మార్కెట్‌కి మించి ఖ‌ర్చు చేశార‌న్న వార్త‌లు విన‌వొచ్చిన నేప‌థ్యంలో ఈ రాబ‌డి చూస్తే… ఖ‌ర్చు పెట్ట‌డంలో త‌ప్పు లేద‌నిపిస్తోంది క‌దూ. ప్ర‌స్త‌తుం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌రు 2న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close