మ‌హానాయ‌కుడు… స‌మాప్తం

ఎట్ట‌కేల‌కు ‘మ‌హానాయ‌కుడు’ షూటింగ్ పూర్త‌యింది. ఈరోజు హైద‌రాబాద్‌లోని సార‌ధి స్టూడియోలో తెర‌కెక్కించిన కొన్ని స‌న్నివేశాల‌తో ఈ షూటింగ్‌కి శుభం కార్డు ప‌డింది. చిత్ర‌బృందం గుమ్మ‌డి కాయ కొట్టేసి… ‘మ‌మ‌’ అనిపించేశారు. నిజానికి జ‌న‌వ‌రి 22నాటికే షూటింగ్ పూర్త‌వ్వాల్సింది. కానీ.. `క‌థానాయ‌కుడు` ఎఫెక్ట్‌తో `మ‌హానాయ‌కుడు`లో మార్పులు మొద‌లెట్టారు. రిపేర్ల పేరుతో రీషూట్లు జ‌రిపి, కొత్త స‌న్నివేశాల్ని తెర‌కెక్కించేస‌రికి.. షూటింగ్ ఆల‌స్య‌మైపోయింది. దాంతో పాటు విడుద‌ల తేదీలోనూ మార్పులొచ్చాయి. ఫిబ్ర‌వ‌రి తొలివారంలో విడుద‌ల కావ‌ల్సిన సినిమా ఇది. ఇప్పుడు మార్చి 1న వ‌స్తోంద‌ని టాక్‌. విడుద‌ల తేదీ ఎప్పుడ‌న్న విష‌యంలో చిత్ర‌బృందం ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. రాబోయే ఒక‌ట్రెండు రోజుల్లో ఎన్టీఆర్ టీమ్ నుంచి విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌క‌శం ఉంది. అంతే కాదు… ఓ ట్రైల‌ర్‌నీ విడుద‌ల చేయ‌డానికి క్రిష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ ట్రైల‌ర్ ఎప్పుడు చూపిస్తారో కూడా త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close