ఇదేం తీరు: పేరుకే జాతీయ అవార్డులు

ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్ అవార్డుల‌కు మోక్షం వ‌చ్చింది. ఐదేళ్ల నుంచీ ఈ అవార్డుల‌ను ప‌ట్టించుకోని ఏపీ స‌ర్కార్ ఇన్నాళ్ల‌కు క‌ళ్లు తెరిచింది. ఒకేసారి రెండేళ్ల (2012, 2013)ల‌కు స‌రిప‌డా అవార్డులు ఇచ్చేసింది. మ‌రో మూడేళ్లు బాకీ ప‌డింది. త్వ‌ర‌లోనే 2014, 15. 16 అవార్డులనీ ఇచ్చి తీర‌తాం… అని అవార్డు క‌మిటీలో ఉన్న‌ ముర‌ళీ మోహ‌న్ సెల‌విచ్చారు. ఈసారి అవార్డులు ఎస్‌పి బాల‌సుబ్ర‌మ‌ణ్యం, హేమామాలినిల‌కు వ‌రించాయి. సింగీతం, కోదండ‌రామిరెడ్డి, సురేష్‌బాబు, దిల్‌రాజు, కోడిరామ‌కృష్ణ‌, వాణిశ్రీ‌ల‌కూ అవార్డులు ద‌క్కాయి. అంతా బాగానే ఉంది. ఇందులో హేమామాలినీ త‌ప్ప‌.. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న క‌ళాకారులేరి? జాతీయ అవార్డు పేరుకేనా? మ‌నం మ‌నం పంచుకొనేదైతే జాతీయ అవార్డు అనే పేరెందుకు? సింగీతం, కోదండ‌రామిరెడ్డి, వాణిశ్రీ‌, కోడిరామ‌కృష్ణ‌.. వీళ్లంతా అవార్డుల‌కు అర్హులే. ఇది కాద‌న‌లేని స‌త్యం. అయితే.. ఈ అవార్డుల ఖ్యాతి పెర‌గాలంటే జాతీయ స్థాయిలో ప్ర‌తిభావంతుల్ని వెదికి ప‌ట్టుకోవాలి. ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఇది వ‌ర‌కు దిలీప్‌కుమార్‌, ల‌తామంగేష్క‌ర్‌, శివాజీగ‌ణేశ‌న్‌, రాజ్‌కుమార్‌, వ‌హీదా రెహ‌మాన్‌.. ఇలాంటి హేమాహేమీల‌కు వ‌రించింది. అదే స్థాయి ఇక ముందూ చూపిస్తే బాగుంటుందేమో..? ముందు అవార్డులు మ‌న వాళ్ల‌కు ఇచ్చుకోవాలి.. ఆ త‌ర‌వాతే ప‌రాయి వాళ్ల‌కు అనేదే అవార్డుల ఉద్దేశం అయితే ఎవ్వ‌రూ కాద‌న‌రు. అస‌లు ఈ చ‌ర్చే అన‌వ‌స‌రం.

మ‌రో ముఖ్య విష‌యం ఏమిటంటే… ఈ జాతీయ అవార్డుల్ని నంది అవార్డుల‌తో ముడిపెట్ట‌డం. అదే వేదిక‌పై అవార్డుల‌ను ప్ర‌దానం చేయాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం. ఐదేళ్ల నందీ అవార్డులు. ఎన్టీఆర్ అవార్డులు, నాగిరెడ్డి చ‌క్ర‌పాణి అవార్డులు, బిఎన్‌రెడ్డి అవార్డులు, ర‌ఘ‌ప‌తి వెంక‌య్య అవార్డులూ.. ఇలా అన్నీ ఒకేసారి ఇవ్వ‌డంతో అవార్డుల ప్రాధాన్యం త‌గ్గిపోవ‌డం ఖాయం. అస‌లే ఎప్ప‌టి అవార్డులో ఇవి. దాన్నీ గుంపులో గొవింద వ్య‌వ‌హారంలా మార్చేస్తున్నార‌న్న‌మాట‌. అవార్డులు ఇచ్చేశాం.. మా ప‌నైపోయింది అనుకొంటే స‌రిపోతుందా? దానికో ప్ర‌ణాళిక అవ‌స‌రం లేదా? 2014, 15, 16 నంది అవార్డుల్ని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అవి పూర్త‌య్యాక మ‌ళ్లీ జాతీయ అవార్డుల లిస్టు విడుద‌ల చేయాలి. ఇవ‌న్నీ ఎప్పుడు అవుతాయి? అవార్డులు ఎప్పుడు ఇస్తారు? చూస్తుంటే ఈజీగా మ‌రో యేడాది గ‌డిచిపోయేట్టుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close