త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ వత్తిడి.. నిజమేనా ?

“దేవిశ్రీ ప్రసాద్”- “తమ్మడు”. ఒక ఇంటర్ వ్యూ రాఫిడ్ రౌండ్ లో దేవిశ్రీ ప్రసాద్ అంటే త్రివిక్రమ్ ఇచ్చిన సమాధానం ఇది. నిజమే.. త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య అంత అనుబంధం వుంది. ”నేను దేవికి ఒక సీన్ చెప్తాను. ఆయన ఓకే ట్యూన్ చెప్తాడు. వాళ్ళ అమ్మ గారు భోజనం పెడుతుంది. ఈ గ్యాప్ లో దేవి వాళ్ళ నాన్న గారితో కాసేపు కబుర్లు చెప్పుకుంటాం. కార్ లో పాట వింటూ ఇంటికి వచ్చేస్తాను. అంతే. అంత సింపులు గా ఉటుంది మా పని” అని ఒక వేదిక పై దేవితో తనకున్న అనుబంధం గురించి చెప్పారు త్రివిక్రమ్. అంతలా ఉటుంది వీరి మధ్య స్నేహం. ఇక వీరి కలయికలో వచ్చిన పాటలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్ వేసుకొనే పాటలు చేశాడు త్రివిక్రమ్ కోసం దేవి.

అయితే మరి ఏమైందో తెలీదు కానీ గత రెండు సినిమాల నుండి దేవిని పక్కన పెట్టేశాడు త్రివిక్రమ్. అఆ సినిమాకి మిక్కి జే, ఇప్పుడు అజ్ఞాతవాసికి అనిరుద్ ని పెట్టుకున్నాడు. నితిన్ ఇమేజ్ కి అఆ పాటలు పాసైపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్కై ఇమేజ్ వున్న స్టార్ కి అనిరుద్ స్వర పరిచిన పాటలు అస్సల్ మ్యాచ్ కాలేదు.ఈ పాటలు విడివిగా వుంటే బావున్నాయి కానీ సినిమాలో మాత్రం తేలిపోయాయి. టోటల్ గా త్రివిక్రమ్ అనిరుద్ ఇద్దరూ కలసి కట్టుగా ఫెయిల్ అయిపోయారు అజ్ఞాతవాసి విషయంలో.

ఇపుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి కూడా అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి రిజల్ట్ చుసిన జనాలు.. మళ్ళీ అనిరుద్ ని పెట్టుకుంటారా ? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనిపై ఇంకొందరు మనసు మార్చుకున్న త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కోసం దేవిశ్రీని దించుతారని వార్తలు కూడా రాస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి చర్చ రాలేదు. అటు త్రివిక్రమ్ నుండి కానీ ఎన్టీఆర్ వైపు నుండి కానీ అసలు మ్యూజిక్ విషయం చర్చకు రాలేదట. ఈ విషయంలో త్రివిక్రమ్ మనసు మార్చుకున్నారనే వార్తలు కేవలం ఊహగానేలా అని చెబుతున్నారు. పైగా త్రివిక్రమ్ కి తన జడ్జ్ మెంట్ పై చాలా కాన్ఫిడెన్స్. ఎదో అజ్ఞాతవాసి అలా జరిగిందని టోటల్ గా తన జడ్జిమెంట్ పైనే విశ్వాశం కోల్పోయే టైపు వ్యక్తి త్రివిక్రమ్ కాదని, ఎన్టీఆర్ సినిమాకి అనిరుద్ తోనే వండర్ క్రియేట్ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ సైడ్ నుండి వత్తిడి పెరిగితే ఆయన మనసు మార్చుకొని దేవిశ్రీ పైవు మొగ్గు చూపే అవకాశం వుందని కూడా వినిపిస్తుంది. మరి త్రివిక్రమ్ పై వత్తిడి తీసుకొచ్చే దిశగా ఎన్టీఆర్ వెళ్తాడా ? అన్నది పాయింట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close