బాల‌య్య సినిమా కోసం ఎన్టీఆర్ రిసెర్చ్‌

అన్న నంద‌మూరి తార‌క రామారావు.. ఆయ‌న చేయ‌ని పాత్ర లేదు. ముట్టుకోని స‌బ్జెక్ట్ లేదు. తెలుగు సినిమా చ‌రిత్ర‌కు సంబంధించినంత వ‌ర‌కూ.. ఎన్టీఆర్ అంటే అవ‌తార పురుషుడే! అలాంటి ఎన్టీఆర్ చేద్దామ‌నుకొని చేయ‌లేని పాత్ర‌ని ఆయ‌న వార‌సుడు నంద‌మూరి బాల‌కృష్ణ చేయ‌గ‌లిగాడంటే అది నిజంగా అబ్బుర‌మే.. అద్భుత‌మే. ఆ అవ‌కాశం `గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి`తో బాల‌య్య‌కు క‌లిగింది. గౌత‌మి పుత్ర శాత‌కర్ణి జీవితాన్ని వెండి తెర‌పై ఆవిష్క‌రించాల‌ని ఎన్టీఆర్ కూడా అనుకొన్నార్ట‌. గౌత‌మి పుత్ర క‌థ‌ని స్క్రిప్టుగా త‌యారు చేసి, ఆయ‌న గెట‌ప్ ఎలా ఉండాలి?? ఎలాంటి ఆయుధాన్ని ధ‌రించాలి? ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి? అనే విష‌యంపై ఎన్టీఆర్ ఆరోజుల్లోనే రిసెర్చ్ చేశార్ట‌. కానీ.. ఎందుక‌నో.. ఆ ప్రాజెక్ట్ అప్ప‌ట్లో ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు అదే క‌థ‌ని నంద‌మూరి బాల‌కృష్ణ త‌న వందో చిత్రంగా తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ గౌత‌మి పుత్ర‌కు సంబంధించిన రిసెర్చ్ ఈ సినిమా విష‌యంలో కాస్త ఉప‌యోగ‌ప‌డింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే. ఈ సినిమాలో అన్న‌గారి వాటా కూడా ఉంద‌న్న‌మాట‌.

ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న శాతక‌ర్ణి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా వంద థియేట‌ర్ల‌లో గౌత‌మి పుత్ర ట్రైట‌ర్‌ని ఆవిష్క‌రించ‌నుంది చిత్ర‌బృందం. జ‌న‌వరి 11న వ‌స్తుందా, లేదంటే 12న ఈ సినిమా రాబోతోందా? అనేది త్వ‌ర‌లో తెలుస్తుంది. ఆడియో రిలీజ్ ఎప్పుడ‌నే విష‌యంలోనూ ఒక‌ట్రెండు రోజుల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. నిజానికి ఈనెల 16నే పాట‌ల్ని విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆడియో రిలీజ్ వాయిదా ప‌డింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com