ఎన్టీఆర్‌కి న‌… న‌…న‌… న‌త్తి!

‘జై’ ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ‘జై’ పాత్ర‌కు సంబంధించిన గెట‌ప్ కూడా విడుద‌ల చేశారు. ఇప్పుడు ఆ పాత్ర‌కు సంబంధించే ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ‘జై’ పాత్ర కు న‌.. న‌.. న‌త్తి ఉంటుంద‌ట‌. చిన్న‌ప్ప‌టి నుంచీ న‌త్తి గురించి మిగిలిన పిల్ల‌లంతా ఆప‌ట్టిస్తుంటే… లోలోప‌లే కుమిలిపోతాడ‌ట‌. స‌మాజంపై కోపం పెంచుకోవ‌డానికి కూడా అదో కార‌ణం అవుతుంద‌ట‌. అద్భుత‌మైన మేధావి.. కానీ స‌రిగా మాట్లాడ‌లేడు… ఇదీ… జై క్యారెక్ట‌ర్ అని తెలుస్తోంది. అదే నిజ‌మైతే… ఈ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం మ‌రో కోణంలో క‌నిపించ‌డం ఖాయమంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు.

ఏదేమైనా మ‌న హీరోల ఆలోచ‌నా దృక్ప‌థాల్లో మార్పులొచ్చాయి. హీరో అంటే.. స‌ర్వాంగ సుంద‌రుడు, స‌క‌ళ‌క‌ళావ‌ల్ల‌భుడు, అత‌నికి ఒక్క దెబ్బ కూడా త‌గ‌ల‌కూడ‌దు.. అనే ఫార్ములా సూత్రాల్ని ప‌క్క‌కు తన్నేస్తున్నారు. సుకుమార్ సినిమాలో చ‌ర‌ణ్‌కి చెవుడు, రాజా ది గ్రేట్‌లో ర‌వితేజ‌కు క‌ళ్లు లేవు. అంధ‌గాడులోనూ అంతే. ఇప్పుడు ఎన్టీఆర్‌కి న‌త్తి. చూస్తుంటే… కొత్త క‌థ‌లు, స‌రికొత్త పాత్ర‌లు, విభిన్న‌మైన హీరోయిజం చూసే రోజులు ద‌గ్గ‌ర ప‌డిన‌ట్టే క‌నిపిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్‌.. ఎన్టీఆర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com