అరగంట ముందే సెట్‌లోకి ఎన్టీఆర్…

రోజుల తరబడి తీసిందే తీస్తారని, ఓ పట్టాన షాట్ ఓకే చేయరని త్రివిక్రమ్‌పై ఓ విమర్శ వుంది. గతంలో ఆయన తీసిన సినిమాలు నెలల తరబడి, ఏడాది లేదా రెండేళ్లు నిర్మాణంలో వున్నవే. వీటికి తోడు ‘అజ్ఞాతవాసి’ ఆడియోలో నిర్మాతల చేత తాను కొంచెం ఎక్కువే ఖర్చు చేయిస్తానని స్వయంగా త్రివిక్రమ్ చెప్పారు. అందువల్ల త్రివిక్రమ్ మీద విమర్శలు పలువురు నిజమే అనుకున్నారు. సదరు విమర్శలకు చెక్ పెడుతూ ‘అరవింద సమేత… వీరరాఘవ’ షూటింగును చకచకా పూర్తి చేస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై ఫైట్ తీసిన త్రివిక్రమ్, ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న మలి షెడ్యూల్‌లో ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ స్పీడుకి ఎన్టీఆర్ జెట్ స్పీడ్ తోడు కావడంతో షూటింగ్ పరుగులు పెడుతోందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ షాట్ ప్లాన్ చేస్తే… ఎన్టీఆర్ అరగంట ముందే సెల్‌లోకి వ‌స్తున్నార్ట‌. త్రివిక్రమ్‌తో కాసేపు సీన్స్ డిస్కస్ చేసి టైమ్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారని తెలిసింది. అసలే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కావడంతో షూటింగ్ యమా స్పీడుగా జరుగుతోంది. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది ప్లాన్. తరవాత రాజమౌళి సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయిన్ కావాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close