ప‌వ‌న్ క్లాప్‌.. త్రివిక్ర‌మ్ న‌వ్వులు.. ఎన్టీఆర్ సినిమా ప్రారంభం

త్రివిక్ర‌మ్ ఉంటే చాలు.. చుట్టూ బోల్డంత సంద‌డి నెల‌కొంటుంది. దానికి తోడు ప‌వ‌న్‌, ఎన్టీఆర్‌లు క‌లిస్తే.. ఆ హంగామా చెప్ప‌త‌ర‌మా! ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభోత్స‌వ స‌మ‌యంలో ఈ ముగ్గురూ క‌లిస్తే ఎంత ఉల్లాసంగా ఉంటుందో తెలిసొచ్చింది. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైందీ చిత్రం. ఎన్టీఆర్‌పై తెరకెక్కించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లాప్ ఇచ్చారు. ఈ వేడుక ఆద్యంతం స‌ర‌దాగా సాగింది. త్రివిక్ర‌మ్ పంచ్‌లు, దానికి ప్ర‌తిగా ప‌వ‌న్ కౌంట‌ర్లు, ఎన్టీఆర్ న‌వ్వుల‌తో ఉల్లాసంగా గ‌డిచింది. ఎన్టీఆర్ త‌న‌యుడు అభ‌య్‌, స‌తీమ‌ణి ప్ర‌ణ‌తి కూడా ఈ వేడుక‌లో పాలు పంచుకొన్నారు. ఎన్టీఆర్ త‌న‌యుడు అభ‌య్ అల్ల‌రిని ఆప‌డం ఎన్టీఆర్ వ‌ల్ల కూడా కాలేదు. ఫొటో సెష‌న్‌లో కూడా ఈ న‌వ్వుల హంగామా కొన‌సాగింది. హారిక హాసిని సంస్థ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ 2018 జ‌న‌వ‌రి నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.