ఓ బేబీ టీజ‌ర్: బామ్మ‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండ‌దు

చిత్ర‌మైన పాత్ర‌లు, విచిత్ర‌మైన కాన్సెప్ట్ – ఇప్ప‌టి సినిమాకి మూలం ఇదే. క్యారెక్ట‌రైజేష‌న్ ఎంత కొత్త‌గా ఉంటే, సినిమా అంత‌గా ఆక‌ట్టుకుంటోంది. `ఓ బేబీ`లో స‌మంత పాత్ర కూడా కొత్త‌గానే తీర్చిదిద్దిన‌ట్టు క‌నిపిస్తోంది. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడు. కొద్ది సేప‌టి క్రితం టీజ‌ర్ విడుద‌ల చేశారు. భానుమ‌తి లా క‌నిపించే సావిత్రి అనే బామ్మ (ల‌క్ష్మి) క‌థ ఇది. ఒక్క‌సారిగా పాతికేళ్ల అమ్మాయిగా మారిపోతుంది. అంటే రూపం పాతిక‌… వ‌య‌సు 75 అన్న‌మాట‌. బామ్మ భామ‌లా మార‌డం వ‌ల్ల జ‌రిగే ప‌రిణామాలేంటి? అనేది ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. టీజ‌ర్ క‌ట్ చేసిన విధానం చూస్తుంటే.. ఈ సినిమా మొత్తం ఫ‌న్ రైడ్‌లానే సాగుతుంద‌నిపిస్తోంది. స‌మంత – ల‌క్ష్మి – నాగ‌శౌర్య – రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. వీళ్లే ఈక‌థ‌కు మూల స్థంభాలు. స‌మంత స‌ర‌దా న‌ట‌న‌, మాట‌లు.. ఇవ‌న్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. `నాతో ఎంట‌ర్‌టైన్మెంట్ మామూలుగా ఉండ‌దు` అనే డైలాగ్‌తో ఈ టీజ‌ర్‌ని ముగించారు. సినిమా కూడా అలానే సాగితే – స‌మంత ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్ ఖాయం. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.