రివ్యూ : ఒక ప్రేమ వ్యధ ‘ఒక మనసు’

నాగశౌర్య హీరోగా టివి 9 సమర్పణలో, మధుర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమాతో మెప్పించిన దర్శకుడు రామరాజు తెరకెక్కించిన సినిమా ‘ఒక మనసు’ స్టార్ హీరోల తనుయులే ఇప్పటి వరకు హీరో లు గా పరిచయం అయ్యి సక్సెస్ హీరో లు గా పరిశ్రమలో నిలబడిన విషయం తెలిసిందే..! కాగా ఈ చిత్రం ద్వారా మెగా కాంపౌండ్ అమ్మాయి నిహారిక కొణిదెల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మెగా డాటర్ ఏ మేరకు గ్లామర్ ఫీల్డ్ లో నెట్టుకు రాగులుగుతుంది… నటిగా ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం ట్రైలర్స్, టీజర్స్ ఇది ఓ పీల్ గుడ్ లవ్ స్టోరీ అనే అంచనాలను పెంచేసాయి.తొలి సారిగా టివి 9 నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, మధుర శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ సినిమాని నిర్మించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలయ్యింది. ఆ అంచనాలతోనే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం….

కథ:

ఎప్పటికైనా, తన తండ్రి కోరికను నెరవేర్చి ఓ మంచి రాజకీయ నాయకుడవ్వాలని కలలు కనే యువకుడు సూర్య (నాగశౌర్య), జైలు నుంచి బెయిల్ పై విడుదలవుతాడు. తండ్రి రావు రమేష్ అతనిని జైలు నుంచి రిసీవ్ చేసుకుని వైజాగ్ లో ఉండమని చెప్పి, అతనికి తోడుగా అవపరాల శ్రీనివాస్ ని ఉంచుతాడు. మూడేళ్లు జైల్లో ఉన్న సూర్య బయటికి రాగానే తన ప్రేమికురాలు హౌస్ సర్జన్ చదివే అమ్మాయి సంధ్య (నిహారిక) గురించి తెలుసుకోవాలనుకుంటాడు. మరో వైపు సంధ్యకు ఓ పెళ్లి సంబంధం చూసి కూతురిని ఒప్పించడానికి తల్లి (ప్రగతి) ప్రయత్నాలు చేస్తుంటుంది. సూర్య ఓ క్రిమినల్ అని, మూడేళ్లు జైల్లో ఉన్న సూర్యను మర్చిపోవాలని కూతురికి చెబుతుంది ప్రగతి..

“కొడుకు రాజకీయాల్లో రాణించాలని తపనపడే తండ్రి రావురమేష్. తన కొడుకు సూర్య కూడా తన బాటలో నడవాలనుకుంటాడు దానికి అనుగుణంగా సూర్య కూడా రాజకీయం లోకి చేరతాడు. తన మావయ్యలా ఎప్పటికైనా ఎమ్మెల్యే అవ్వాలనే టార్గెట్ తో ఉంటాడు. విజయనగరంలో సెటిల్స్ మెంట్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. సంధ్య ఓ సందర్భంలో సూర్యను చూసి ప్రేమలో పడుతుంది. సూర్య కూడా ఆమెను ప్రేమిస్తాడు. సూర్య చేస్తున్న సెటిల్ మెంట్స్ సంధ్యకు నచ్చవు. అయినా సరే అతని మీద వున్న ప్రేమతో సర్ధుకు పోతుంది. ఒకానొక టైమ్ లో సెటిల్స్ మెంట్స్ ఆపేసి, తన గురించి ఆలోచించమని చెబుతుంది సంధ్య. ఆమె మీద ప్రేమతో సూర్య కూడా అంగీకరిస్తాడు. కానీ తండ్రి తన కోసం చేస్తున్న త్యాగాలు గమనించిన సూర్య, ఆయన కల నెరవేర్చడానికి ఓ సెటిల్ మెంట్ చేయడానికి అంగీకరిస్తాడు. ఆ సెటిల్ మెంట్ సూర్యను జైలు పాలయ్యేలా చేస్తుంది.” ఇదీ సూర్య ఫ్య్లాష్ బ్యాక్…. మూడేళ్ల తర్వాత కలుసుకున్న సంధ్య, సూర్య ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ సూర్యకు సంధ్యను దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మరి తనెంతో ఇష్టపడే సంధ్యను సూర్య దూరం చేసుకుంటాడా… తనను ఎంతో ప్రేమించే సూర్యకు ఏర్పడిన పరిస్థితులను అర్ధం చేసుకున్న సంధ్య ఆ పరిస్థితుల నుంచి సూర్యను బయటపడేయడానికి ఏం చేస్తుంది అనేదే మిగతా కథ…

నటీనటుల పర్ ఫామెన్స్:

నాగశౌర్య ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో లవర్ బోయ్ గా మెరిసాడు. కానీ ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచే నటన ప్రదర్శించాడు. ఆ పాత్రలోని ఎమోషన్‌ను నాగశౌర్య క్యారీ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో అంతకుమించి నటించడానికి అతనికి స్కోప్ లేదు .ఓ ప్రేమికుడిగా, తండ్రి ఆశయం కోసం మదనపడే కొడుకుగా చాలా చక్కగా నటించాడు నాగశౌర్య. లవ్, సెంటిమెంట్ సీన్స్ లో మెచ్చుర్డ్ గా పెర్ ఫామ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా పరిచయం అయిన సినిమా ఇది. మొదటి సినిమాతోనే తన ప్రెజెన్స్ ఏంటో చూపించింది. డాక్టర్ సంధ్య గా పాత్రకు నిహారిక బాగుంది. ప్రేమికురాలిగా చక్కటి పెర్ ఫామెన్స్ చూపించింది. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ సన్నివేశాల్లో బాగా నటించింది. తండ్రి పాత్రల్లో జీవిస్తున్న రావు రమేష్ మరోసారి ఈ సినిమాలో కూడా తండ్రి పాత్ర చేసారు. పాజిటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ వారి పరిధిమేరకు వారు నటించారు.

సాంకేతిక వర్గం:

మెయిన్ స్టోరీ లైన్ బాగుంది. దర్శక, రచయిత రామ రాజు, కథగా చెప్పాలనుకున్న ఆలోచన బాగుంది. కెరీర్, ప్రేమ రెండూ వదులుకోలేని పరిస్థితుల్లో ఒక ప్రేమజంట పడే మథనం ఏంటీ? వారి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందీ? అన్న ఆలోచనతో ఓ కథ చెప్పాలన్న ఆలోచన మంచిదే! కానీ ఆ స్టోరీని ఎలివేట్ చేసే విధంగా సన్నివేశాలు లేవు. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ సీన్స్ బాగున్నాయి. నత్త నడక నరేషన్ ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. ఆ పరంగా డైరెక్టర్ లోపమనే చెప్పాలి. అయితే కమర్షియల్ అంశాలు జోడించే అవకాశం ఉన్నప్పటికీ, ఓ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ని చూపించాలనే దర్శకుడి తాపత్రయం ఆ వైపుగా ఆలోచించనివ్వలేదనే విషయం స్ఫష్టమవుతోంది. కొన్ని డైలాగులు బాగున్నాయి. సునీల్ కశ్యప్ అందించిన రెండు పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్ కొన్ని సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తే.. కొన్ని సీన్స్ విషయంలో రీ-రికార్డింగ్ డామినేట్ చేసిందనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త సమయం కేటాయించాల్సింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

ప్రేమకథల్లో ఎప్పుడూ ఒకే కథ ఉన్నా, కొత్త ఆలోచనతో ఆ కథ చెప్పిన ప్రతిసారీ బాగుంటుంది. చెప్పాలనుకున్న ఆ ఆలోచనను సరిగ్గా చెప్పకుండా, అదే కథను పాత స్టయిల్ లో చెబితే మాత్రం బోర్ కొడుతుంది ఈ చిత్రం విషయం లో అదే జరిగింది. హీరో, హీరోయిన్ మధ్య సాగే లవ్ సీన్స్ రిపీట్ అవుతున్నట్టుగా ఉంటాయి. నాగశౌర్య, నిహారిక మధ్య మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినప్పటికీ, అవే సీన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపించడం ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తుంది. హీరో, హీరోయిన్ మెచ్చుర్డ్ గా ఆలోచించడం, తను ప్రేమించినవాడు బాగుండాలని ఆలోచించి హీరోయిన్ చనిపోవడం మనసులను హత్తుకుంటుంది. కమర్షియల్ సినిమాలకు అలవాటుపడిన ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవ్వదు. అయితే రొటీన్ కి భిన్నంగా ఫీల్ గుడ్ మూవీస్ ని ఆస్వాదించే వారికి సినిమా పరవా లేదు అనిపిస్తుంది. చివరాఖరికి చెప్పేదేటంటే నటి నటుల పెర్ఫార్మన్స్ బాగుంది కానీ కథ ప్రెజెంటేషన్ బాగో లేదు. లవ్ స్టోరీస్ ని ఇష్టపడే యూత్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది..

తెలుగు360.కామ్ రేటింగ్ 2.25/5

బ్యానర్ : మధుర ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు : నాగశౌర్య, నిహారిక కొణిదెల (తొలి పరిచయం), రావు రమేష్, నాగినీడు, ప్రగతి, అవసరాల శ్రీనివాస్, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : సునీల్ కశ్యప్,
పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, భాస్కరబట్ల రవి కుమార్,
సహ నిర్మాతలు : ఎ.అభినయ్, డా.కృష్ణ భట్ట (KKNKTV)
సమర్పణ : టివి 9
నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : రామరాజు,
విడుదల తేదీ :24.06.2016.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close