కేసీఆర్ పుట్టిన రోజుకు కోటి మొక్కల కానుక..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును ఈ సారి మరుపురానిదిగా చేయడానికి టీఆర్ఎస్ నేతలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయం.. మొక్కల పెంపకంపై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న కేసీఆర్‌కు… ఆ దిశగానే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మొత్తం ఆయన పుట్టిన రోజు నాడు… ఆయనకు గిఫ్ట్‌గా కోటి మొక్కలు నాటాలలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల పదిహేడో తేదీన కేసీఆర్ బర్త్ డే. అందుకే.. టీఆర్ఎస్ నేతలు చాలా చురుకుగా క్యాంపైన్ చేస్తున్నారు. ఈ ఇనిషియేటివ్ ను… సీఎం కేసీఆర్ సమీప బంధువు.. ఎంపీ సంతోష్ కుమార్ తీసుకున్నారు. ఆయన కొద్ది రోజులుగా మొక్కల చాలెంజ్ నిర్వహిస్తున్నారు.

ఓ అడవిని దత్తత తీసుకోవడమే కాదు.. ప్రభాస్ లాంటి నటులతో దత్తత తీసుకనేలా చేశారు. ఆయన పిలుపునిచ్చిన కారణంగా టాలీవుడ్ బాలీవుడ్ నటులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు కూడా. ఇప్పుడు..ఆయన చొరవతోనే సెలబ్రిటీలు కూడా… కేసీఆర్ పుట్టిన రోజుకు కోటి మొక్కల కానుక ఇద్దామని.. అందులో భాగస్వాములపై.. తలా ఓ మొక్క నాటాలని పిలుపునిస్తున్నారు. అయితే కోటిమొక్కలు … ఒక్క తెలంగాణలో అయితేనే సాధ్యం కాదు కాబట్టి ఏపీని కూడా లెక్కలో వేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో బాధ్యత తీసుకుంటుననట్లుగా కనిపిస్తోంది.

ఎమ్మెల్యే రోజా ఈ మేరకు పిలుపునిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. బహుశా ఆమె తన నగరి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ పుట్టిన రోజు కారణంగా మొక్కలు నాటిస్తారేమో అన్న చర్చ జరుగుతోంది. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఇనిషఇయేటివ్‌లో భాగం అయి… కేసీఆర్ పుట్టిన రోజు మొక్కల్ని ఏపీలో ఏపుగా పెంచుతారేమో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close