విరాళం అడగరు.. తీసేసుకుంటారు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామని సర్కార్ ప్రకటించింది. కేంద్రం ఇవ్వకపోయినా కొనుగోలు చేస్తామని.. రూ. పదహారు వందల కోట్లు ఖర్చు చేస్తామని ఘనంగా ప్రకటించారు. ఆ వెంటనే.. విరాళాల సేకరణను కూడా ప్రారంభించారు. కొంత మంది వచ్చి విరాళాలు ఇచ్చిపోయారు. ఇప్పుడు అంతర్గతంగా విరాళాల సేకరణ ప్రారంభమయింది. ఉద్యోగుల జీతంలో ఒక రోజు కోత విధించేందుకు నిర్ణయించారు. విద్యుత్ శాఖలో ఉద్యోగుల ఒక్క రోజు జీతాన్ని వ్యాక్సినేషన్ కోసం ఇస్తున్నట్లుగా సర్క్యులర్ జారీ చేశారు. దీన్ని చూసి ఉద్యోగులకు మండిపోయింది. వెంటనే ఉద్యోగ సంఘాల నేతలను నిలదీశారు. వారేమో.. అమ్మతోడు మాకు చెప్పలేదని… తమ ఉద్యోగులకు సర్ది చెప్పుకోవాల్సి వస్తోంది.

అయినా వినకపోవడంతో.. వారు మీడియాకు తమ అసంతృప్తి గురించి తెలియచెబుతున్నారు. ఒక్క రోజు జీతం కోతపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం విద్యుత్‌ ఉద్యోగుల నుంచి.. ఒకరోజు వేతనం కట్‌ చేస్తున్నట్లు సీఎండీ ఇచ్చిన సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తున్నట్లు విద్యుత్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. విరాళం ఇస్తామో లేదో తర్వాత.. కానీ అసలు తమ అనుమతి లేకుండా.. తమ జీతంలో ఒకరోజు ఎలా విరాళం ప్రకటించేసుకుంటారని మండిపడుతున్నారు. ఈ మేరకు సీఎండీకి విద్యుత్‌ సంఘాల జేఏసీ నేతలు లేఖ రాశారు. మా అనుమతి లేకుండా, కనీసం సంప్రదించకుండా.. వేతనాలు ఎలా కట్‌ చేస్తారని…తక్షణం సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులందరి జీతాల్లో ఒక్క రోజు వేతనాన్ని తీసుకోవాలన్న ఆలోనచలో ప్రభుత్వం ఉంది. అయితే.. ఇప్పటికి పీఆర్సీ ఇవ్వకపోవడం.. డీఎలు కట్ చేయడం.. ఇస్తామన్నవి ఇవ్వకపోవడంతో… వారు అసంతృప్తిలో ఉన్నారు. ఇంకా వాటికని.. వీటికని …వారి జీతాల్ని విరాళాల ఖాతాలో వేసుకోవడం వారిని అసంతృప్తికి గురి చేస్తోంది. అయితే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం.. ప్రభుత్వానికే మద్దతుగా ఉన్నారు. దీంతో ఉద్యోగులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక రోజు వేతనం కట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close