ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమి విలువ రూ. లక్ష కోట్లు..!?

తెలంగాణలో ఇప్పుడు అత్యంత పువర్ ఫుల్ ఎవరు.. అంటే.. మరో మాట లేకుండా కేసీఆర్ మాట చెబుతారు. అదే రాజకీయాల్లో లేకుండా.. అంత కంటే.. పవర్ ఎక్కువ ఎవరి దగ్గర ఉందంటే… ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు చెబుతారు. హైదరాబాద్ చుట్టుపక్కన రియల్ ఎస్టేట్ వెంచర్లతో… లగ్జరీ అపార్టులమెంట్ల నిర్మాణంలో రాటుదేలిపోయిన ఆయన .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో దశకు వెళ్లిపోయారు. అటు తన వ్యాపార రంగంలో ఇతరులు ఎవరూ.. దగ్గరకు రానంత ఎత్తుకు ఎదిగిపోయారు. అదే సమయంలో.. ప్రభుత్వంలో పలుకుబడిని కూడా… ప్రభుత్వ పెద్ద స్థాయికి చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఉన్న భూములు.. చర్చనీయాంశమవుతున్నాయి.

రింగ్ రోడ్డు చుట్టూ వందల ఎకరాల ఆస్తి ఉన్న భూస్వామి ఆయన..!

తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సైతం.. రాజగురువుగా.. ప్రచారం పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి… ఓ కంపెనీ పేరుతోనే .. ప్రసిద్ధి పొందారు. కానీ.. రికార్డుల్లో ఆయనకు పదుల సంఖ్యలో కంపెనీలున్నాయి. వాటి పేరు మీద.. భూములు ఉన్నాయి. అదీ కూడా.. ఎకరం.. అరెకరం కాదు.. పదుల ఎకరాల్లోనే ఒక్కో కంపెనీపై భూమి ఉంది. ఈ భూమి అంతా.. హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్‌ రోడ్డును ఆనుకుని.. అటూ.. ఇటు ఉన్న గ్రామాల్లోనే ఉంది. ముచ్చింతల్, గొల్లూరు. పెద్ద తూప్రా, పాలమాకుల, మదనపల్లి, సంఘిగూడ, నాగారం, నందిపల్లి, అమీర్‌పేట్ , కల్వకోల్, తూప్రాఖుర్ద్, వెంకన్నగూడ, సుభాన్ పూర్, వెలిజర్లు, శేరిగూడ, మధురాపూర్, పెంజర్ల , పొమలాపల్లి, హేమాజీ నగర్‌లలో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. వీటికి సంబంధించిన డాక్యుమెట్లు కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాటితో రూ. లక్ష కోట్లు ఈజీగా సంపాదించేయగలరు..!

మొత్తం డాక్యుమెంట్ల సహితంగా ఉన్న భూములు దాదాపుగా 2700 ఎకరాలు. ఇవన్నీ నేరుగా.. ఆ రియల్ వ్యాపారి.. ఆయన బంధువర్గం మొత్తం.. డైరక్టర్లుగా.. యాజమాన్య హోదాల్లో ఉన్న కంపెనీల పేరు మీద ఉన్నది. ఇక తెర వెనుక లావాదేవీల్లో భాగంగా.. మరికొన్ని వందల ఎకరాలు.. ఇతర కంపెనీల చేతుల్లో ఉందని చెబుతూంటారు. ఇదంతా తీసేసిన.. ఆయన సొంత కంపెనీల పేరు మీద.. 2700 ఎకరాల భూమి ఉండటం అంటే మామూలు విషయం. డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో రాటుదేలిపోయిన ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి.. వీటిని మార్కెట్ చేసుకుని సునాయసంగా రూ. లక్ష కోట్లు సంపాదించగలరని.. రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు… గచ్చిబౌలిలో.. ఆయన కంపెనీ కట్టిన భారీ అపార్ట్ మెంట్ ప్రాజెక్ట్‌లో.. ఒక్కో ఫ్లాట్ ధర కనీసం రూ. మూడు కోట్ల వరకూ ఉంది. ఆఫీసుల కోసం మరో టవర్ ఉంది. దాదాపుగా పది టవర్లతో కట్టిన ఆ ఆపార్టుమెంట్ నుంచే.. ఐదు వేల కోట్లకుపైగానే బిజినెస్ ఉంటుంది. ఆ ఒక్క ప్రాజెక్ట్ మీదే అంత బిజినెస్ చేస్తే.. 2700 ఎకరాలతో రూ. లక్ష కోట్లు చేయడం.. పెద్ద విషయం కాదేమో..?

ఇంతకీ ఆ భూములన్నీ ఎలా వచ్చాయి..?

అయితే.. ఈ భూములన్నీ… ఆయనకు ఎలా వచ్చాయన్నదానిపై విపరీతమైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా కొనుగోలు చేశారా.. లేక.. ఏదైనా ప్రాజెక్ట్ కోసం.. సమీకరించారా… ? డెలవప్‌మెంట్‌కు తీసుకున్నారా.. అన్నదానిపై.. ఇప్పుడు చర్చ జరుగుతోంది.సోషల్ మీడియాలోనూ.. అదే ప్రశ్న వస్తోంది. కానీ దీనికి ఆ రియల్ వ్యాపారి సమాధానం చెప్పరు. ఎవరైనా అడిగితే.. వారికి… అంతకు మించిన హెచ్చరికలు వెళ్తాయన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి ఓ రియల్ వ్యాపారి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం మాత్రం… తెలంగాణ సమాజాన్ని మాత్రం అబ్బురపరచడం ఖాయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close