ఎడిటర్స్ కామెంట్ : పునాదులు కదిలే పరాజయం ఎదురైనా పాఠాలు నేర్చుకోని టీడీపీ..!

2019 మే 23.. .. తెలుగుదేశం పార్టీకి ఓ పీడకల. కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తమ సమర్థవంతమైన పరిపాలనతో ఓ దశ.. దిశ తీసుకు వచ్చామని… ఉజ్వలమైన భవితకు పునాదులు వేశామని నమ్మకంతో ఎన్నికలకు వెళ్లారు. కానీ ప్రజలు మరో రకంగా ఆలోచించారు. టీడీపీ పాలన అవసరం లేదని తీర్పు ఇచ్చారు. టీడీపీ చెప్పే రాజధాని.. ఆర్థిక వృద్ధి.. ఉజ్వల భవిష్యత్.. పారిశ్రామికీకరణ.. ఇవన్నీ.. ప్రజల ఓటింగ్ ప్రయారిటీలో భాగం కాలేదు. వారి ఎజెండా మారిపోయింది. కానీ టీడీపీ ఎజెండా మారలేదు. ఫలితంగా.. ప్రజలు.. వైసీపీ జెండా పట్టుకున్నారు. మరి ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ విశ్లేషణ చేసుకుందా..? ఏడాదిలో తమ రాజకీయాన్ని మార్చుకుందా..? అంటే.. లేనే లేదని చెప్పాలి. సంప్రదాయ రాజకీయాలతోనే .. ముక్కుతూ.. మూలుగుతూ ముందుకెళ్తోంది.

ఘోర ఓటమి తర్వాతా అదే సంప్రదాయ రాజకీయమా..?

చంద్రబాబు ఔట్ డేటెడ్ రాజకీయ నేత అని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. ఆయన ప్రత్యర్థులు కాబట్టి.. అలానే అంటారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ చేస్తున్నవి పాత కాలపు రాజకీయాలే. రాజకీయాన్ని రాజకీయంలా చేయాలి.. పాలనను పాలనలా చేయాలి. కానీ పాలనను చూపించి.. అదే రాజకీయం అంటే.. వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా రాజకీయం నడపడమే… ప్రస్తుతం సక్సెస్‌కు మార్గం. ఆ ప్రజాభిప్రాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది రాజకీయ పార్టీల వ్యూహం. ఇప్పుడు.. ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. భావోద్వేగాల రాజకీయం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ప్రజలు 175 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 151 కట్టబెట్టారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఇచ్చింది 23 అంటే ఇరవై మూడు. తన ఐదేళ్ల పాలనలో .. విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఉజ్వల భవిష్యత్‌కు పునాది వేశానని చంద్రబాబు గట్టిగా నమ్మారు. అదే సమయంలో.. ప్రజలు ఐదేళ్ల పాటు ఎలాంటి కష్టాలు రాకుండా.. సంక్షేమం చూసుకోగలిగానని ఆయన భావించారు. కానీ ప్రజలు అంతకు మించి ఏదో కోరుకున్నారు. ఏదో కోరుకున్నారని అనుకోవడం కన్నా.. కోరుకునేలా.. విపక్షం చేయగలిగిందనడం కరెక్ట్. పాలన అంతా ఓ సామాజికవర్గం చేతుల్లో ఉందని ప్రచారం చేయడం దగ్గర్నుంచి ప్రతీ దాంట్లోనూ అవినీతి ఉందని బురద చల్లడం వరకూ.. ఎన్నెన్ని రాజకీయ ప్రచారాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజల్ని నమ్మించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల కుమ్ములాట పెడుతోందని.. తెలిసి కూడా.. చంద్రబాబు.. టిట్ ఫర్ టాట్‌గా.. రాజకీయం చేయలేకపోయారు. తాను మంచి పాలన అందిస్తున్నానని.. సంక్షేమం ఇస్తున్నానని అదే తనని గెలిపిస్తుందనే నమ్మకం పెట్టుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాతా దాన్ని గుర్తించలేకపోతున్నారు.

తెలుగు వాళ్లంతా కుల, మత, ప్రాంతాలుగా విడిపోయారు..! టీడీపీకి కొత్త బేస్ వెతకాలి..!

చంద్రబాబుకు ఆధునిక రాజకీయ సైకాలజీ అర్థం కావడం లేదు. ఆయన ఎకనమిక్స్‌లో పీజీ చేశారు. కానీ.. పాలిటిక్స్‌లో ఓల్డ్ బీఏలోనే ఉండిపోయారు. దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎలా ఎదిగింది..? ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా రైజ్ అయింది..? ఆంధ్రప్రదేశ్ స్థాయిలో వైసీపీ ఎలా ప్రకాశించింది..? ఈ పార్టీలను కేస్ స్టడీలుగా తీసుకుంటే.. చంద్రబాబు ఎక్కడ వెనుకబడిపోతున్నారో స్పష్టమవుతోంది. ప్రతీ రాజకీయ పార్టీకి.. ఓ బేస్ ఉండాలి. టీడీపీ ఇప్పుడు ఆ బేస్‌ను కోల్పోతోంది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఉనికిలోకి వచ్చిన పార్టీ.. ఇప్పటికీ అదే నినాదాన్ని పట్టుకుని ఉంది. కానీ తెలుగు వాళ్లు.. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడిపోయారు. అలా విడగొట్టి రాజకీయం చేయడంలో ఇతర పార్టీలు సక్సెస్ అయ్యారు. కానీ టీడీపీ అదే ఉద్వేగంతో అందర్నీ కలిపి ఉంచి తాము బలంగా ఉండాలని అనుకుంటోంది. కానీ అది సాధ్యం కాదని దేశవ్యాప్తంగా విజయాలు సాధిస్తున్న రాజకీయ పార్టీలు నిరూపిస్తున్నాయి.

కొత్తగా గెలుస్తున్న పార్టీల విన్నింగ్ ఫార్ములాను అధ్యయనం చేయలేదా..?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడల్లా.. అభివృద్ధి కోణంలోనే ప్రజలు చూశారు. అది ఎజెండా కానప్పుడు ఆయనకు ఘోర పరాజయమే ఎదురయింది. మారుతున్న పరిస్థితుల్లో.. అభివృద్ధి.. అనేది ఎప్పటికీ ఎజెండా కాదన్న విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో.. తెలుగుదేశం పార్టీ డైనమిక్‌గా తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంది. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే.. ప్రజలు గుర్తించి ఓట్లేస్తారనుకోవడం అపోహే. అవన్నీ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నట్లు నిరూపించుకోవడానికి సరిపోతాయి. అందర్నీ సంతృప్తి పరచాలనే భ్రమను కూడా వదిలి పెట్టుకోవాలి. మెజార్టీని మాత్రమే టార్గెట్ పెట్టుకుని రాజకీయం చేయాలి. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్.. వైసీపీల రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే… ఒక ఆబ్జెక్ట్‌కు వ్యతిరేకంగా… అందర్నీ ఏకం చేసి విజయాలను సాధించారు. వీటి గురించి విశ్లేషిస్తే.. ఓ గ్రంథం అవుతుంది. చాలా పకడ్బందీగా అమలు చేశారు కబట్టే సక్సెస్ అయ్యారు.

కారణాలు చెప్పడం.. రాజకీయ చేతకానితనమే..!

ఇంగ్లిష్ మాట్లాడటం ఎందుకు నేర్చుకోలేదురా..? అంటే బ్రిటిష్ వాడిపై కోపం.. అని.. సాకులు చెబితే చాలా కామెడీగా ఉంటుంది. రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు అంటే.. విభజన రాజకీయాలు… ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేయడం తమకు ఇష్టం లేదని కారణాలు చెబితే అతి చేతకాని తనమే. రాజకీయం అంటే..మెజార్టీని ఆకట్టుకుని.. విజయం సాధించడమే. దాని కోసం… రాజకీయ పార్టీలు.. ప్రతీ సారి ఒక్కో వ్యూహాన్ని అవలంభిస్తూ ఉంటాయి. ఆ వ్యూహాలను ఇప్పుడు.. కులం, మతం, వర్గం, ప్రాంతాలు శాసిస్తున్నాయి. ప్రజా సమస్యలు కాదు. వీటి నుంచి పాఠాలు నేర్చుకుని వ్యూహాలు మార్చుకుంటేనే.. టీడీపీ కొత్త తరం రాజకీయంలోకి వస్తుంది లేదంటే… ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close