ర‌కుల్‌ని ‘దేవ్‌’డే కాపాడాలి!

అప్పుడెప్పుడో 2017లో వ‌చ్చింది ‘స్పైడ‌ర్‌’. అప్ప‌టి వ‌ర‌కూ టాప్ గేర్‌లో సాగిన ర‌కుల్ ప్రీత్ సింగ్ కెరీర్‌కి ఈ భారీ ఫ్లాప్ ఒక్క‌సారిగా బ్రేకులు వేసింది. ఆ త‌ర‌వాత తెలుగు తెర‌పై ర‌కుల్ ఫ్రీత్ సింగ్ క‌నిపించిందే లేదు. ‘క‌థానాయ‌కుడు’లో మాత్రం శ్రీ‌దేవిగా మెరిసింది. ఆ డిజాస‌ర్ట్‌లో భాగం పంచుకుంది. కాక‌పోతే… ఈ సినిమాలో ర‌కుల్ కూడా ఉంది అని గుర్తు పెట్టుకునేంత ఛాన్స్ లేదు. తెలుగులో క‌థానాయిక‌గా ర‌కుల్ చేస్తున్న సినిమాలేవీ లేవు. త‌మిళ, హిందీలో మాత్రం కొన్ని సినిమాలు ద‌క్కించుకుంది. అందులో కార్తీ తో చేస్తున్న ‘దేవ్‌’ ఒక‌టి. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రూ క‌ల‌సి ‘ఖాకీ’లో న‌టించారు. ఆ సినిమాలో వీరిద్ద‌రి జోడీ బాగానే క‌నిపించింది. సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడు ఈ `దేవ్‌`పైనే ర‌కుల్ ఆశ‌లు పెట్టుకుంది.

ఈ సినిమా హిట్ట‌యితే, తెలుగులోనూ త‌మిళంలోనూ ఇంకొన్ని అవ‌కాశాలు సంపాదించుకోవ‌చ్చ‌ని ర‌కుల్ ఆశ‌. ఇప్ప‌టికే న‌వ‌ర‌తం క‌థానాయిక‌ల జోరు మ‌ధ్య‌.. ర‌కుల్ కనిపించ‌కుండా పోతోంది. మ‌రో ఫ్లాప్ ప‌డితే… తెలుగులో ఆమెని ప‌ట్టించుకునేవారే క‌నిపించ‌రు. అందుకే ఈ సినిమాపై బాగా ఫోక‌స్ చేసింది. ఈ సినిమా కోసం వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌మోష‌న్ చేసుకోవాల‌ని చూస్తోంది. నిర్మాత‌ల‌తో, టీమ్‌తో సంబంధం లేకుండా త‌న సొంత పీఆర్‌తో ఈ సినిమాకి ప‌బ్లిసిటీ తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది ర‌కుల్‌. ర‌జ‌త్ ర‌విశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల అవుతోంది. మ‌రి `దేవ్‌` ర‌కుల్ జాత‌కాన్ని ఏమైనా మారుస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close