సచివాలయం కూల్చివేత – ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ !

పాలకుల ప్రాధాన్యతలు, పాలితుల దైనందిక సమస్యలు, వారి కనీస అవసరాలు తీర్చే దిశగా, పరిష్కారారాలు వెతికే మార్గం మీద ఉండాలి. అప్పుడే అది జనరంజకమైన పాలన అనిపించుకుంటుంది.
శతాబ్దానికి ఒక్కసారి వచ్చే విపత్తు ని కోవిద్ 19 రూపంలో ప్రపంచం ఎదుర్కొంటున్నది ఈ రోజు. ఈ విపత్తు ని హైదరాబాద్ లాంటి మహానగరాలు వున్న ప్రతి రాష్ట్రం మరింత తీవ్రంగా చవిచూడవలసి వస్తున్నది.
రోజు రోజుకి కరోనా బాధితులు ఎక్కువ అవుతున్న ఇలాంటి సమయంలో ప్రస్తుతం అందుబాటులో వున్న హాస్పిటల్స్, డాక్టర్స్, వైద్య పరికరాలు ఏమాత్రం సరిపోవటం లేదు. పరిమితంగా వున్న వనరుల్ని వాడుకుంటూ, వినూత్నమైన పద్ధతుల్లో కొత్త వనరుల్ని, వసతులని వెతుకుంటూ ముందుకు నడవాల్సిన సమయంలో సెక్రెరియేట్ భవనాన్ని పడగొడటం లాంటి కార్యక్రమాల్ని చూస్తుంటే చాల ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నది.
హాస్పిటల్స్, బెడ్స్ తక్కువ వున్న కారణంగా , 13 సంవత్సరాలుగా నిరుపయోగంగా వున్న గాచిబౌలీ స్టేడియం భవనాన్ని అందుబాటులోకి తీసుకురావటం లాంటి మంచి పనులు చేసిన తెరాస ప్రభుత్వం, అదే పనిని ఈ రోజు 25 ఎకరాల స్థలంలో, మంచి ప్రదేశంలో అందరికీ అందుబాటులో ఆ సెక్రెరియేట్ భవనాన్ని కూడా తాత్కాలికంగా హాస్పిటల్ గా మారిస్తే కనీసం 1500 నుండి 2000 పడకలతో ప్రజలకి ఉపయోగపడుతుంది.
న్యూ ఢిల్లీ ప్రభుత్వం 500 రైల్వే కోచ్ లను 8000 మంది పేషెంట్స్ కి పనికివచ్చేలా మార్చిన విషయాన్నీ మనం అందరం చూస్తున్నాము, అలాగే ప్రపంచంలోనే పెద్దది అయిన హాస్పిటల్ని రాధా స్వామి స్పిరిట్యుయల్ సెంటర్లో యుద్దప్రాతిపదిక మీద నిర్మిస్తున్న విషయం, అలాగే ఎక్సిబిషన్ సెంటర్స్, హోటల్స్ ని కోవిద్ వార్డ్స్ మారుస్తున్న విషయం తెలిసినదే!
ఇక మహారాష్ట్ర ప్రభుత్వం విప్రో కంపెనీ పూణే ఆఫీస్ బిల్డింగ్ ని 450 బెడ్ హాస్పిటలుగా మార్చింది, ముంబైలో ప్రఖ్యాత బిల్డర్ శ్రీజి శరన్ developers సహాయంతో మలాద్ లో వారి కాంప్లెక్స్ ని కోవిద్ ఆసుపత్రి కింద మార్చటం చేసింది.
ఇక కేరళ రాష్ట్రం అందుబాటులో వున్నా ప్రతి సదుపాయాన్ని కోవిద్ హాస్పిటల్స్, ఐసొలేషన్ వార్డ్స్ కింద మారుస్తుంది. టూరిజం కి మాత్రమే పనికివచ్చే హౌస్ బోట్స్ ని కూడా ఐసొలేషన్ వార్డ్స్ కింద మార్చివేసింది. గుజరాత్ లోని అనంత్ యూనివర్సిటీ కి చెందిన సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ టీం సహాయంతో కేరళ ప్రభుత్వం ఈ అద్భుతమైన చర్యలు చేపట్టింది.
ఈ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ టీం కేరళ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సహాయం అందించింది, మరిన్నిఆ రాష్ట్రాలకి అడిగితే సహాయం చేయటానికి వారు సిద్ధంగా వున్నారు.

ఈ రోజు ప్రతి విషయంలో సమగ్రమైన అవగాహనా వున్న ముఖ్యమంత్రిగా పేరు పొందిన శ్రీ కెసిఆర్ ఈ విషయంపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం వుంది. IT మినిస్టరుగా వున్న శ్రీ కే తారక రామారావు గారు హైదరాబాద్ లో వున్నా IT కంపెనీస్ తో మాట్లాడితే కొన్ని లక్షల చదరపు అడుగుల స్థలం వున్న భావనాల్ని కోవిద్ పేషెంట్స్ కి పనికివచ్చేవిధంగా మార్చవచ్చు. ప్రస్తుతం ఈ భవనాలు ఉద్యోగుల వర్క్ ఫ్రొం హోమ్ విధానంతో ఖాళీ గా వున్నాయి. ఆయన చొరవ చూపితే ఈ భవనాల్లోనే కాన్ఫరెన్స్ హాల్స్, కెఫెటేరియస్ లాంటి ప్రదేశాలని తాత్కాలిక ప్రాతిపదిక మీద తీసుకోవచ్చు.

అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా ప్రఖ్యాత బిల్డర్స్ దగ్గర వున్న భవంతులు మరిన్ని రానున్న రోజుల్లో covid పేషెంట్స్ కి ఉపయోగపడేలా మార్చవచ్చు.

స్థూలంగా కనిపించేవి స్మూక్షంగా వున్న వాస్తవాలను మరుగున పరుస్తాయి, అయితే అది అన్ని వేళలా వాస్తవంగా ఉండదు. ఇది సూక్ష్మగ్రాహి అయిన శ్రీ కెసిఆర్ కి తెలిసినంత మరెవ్వరికీ తెలియదు, ఆయన ఈ దిశగా ప్రజాప్రయోజనాల కొరకు దృష్టి సారించాలి, చర్యలు తీసుకుంటారు అని ఆశిద్దాము.

శుభాభినందలతో,
బసవేంద్ర సూరపనేని డిట్రాయిట్, USA

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close