ముస్లింలు కాకపోతే ఇండియన్సే..! బీజేపీ మార్క్ చట్టం..!

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లపై.. దేశం మొత్తం చర్చించుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఓ వివాదాస్పద బిల్లును పాస్ చేసింది. అదే పౌరసత్వానికి చెందిన అత్యంత కీలకమైన బిల్లు. పొరుగు దేశాల నుంచి ఇండియాలోకి అక్రమంగా వచ్చే చొరబాటుదారులను … పౌరులుగా గుర్తిస్తూ.. చేసిన చట్టం అది. అసలు చొరబాటు దారులను ఎందుకు .. భారతీయులుగా గుర్తించాలన్నది.. ఓ మౌలికమైన ప్రశ్నకాగా.. ఇందులోనూ.. కేవలం ముస్లిమేతరులకు మాత్రమే… చాన్నిచ్చారు. పొరుగులు దేశాల నుంచి వచ్చే ముస్లింలకు మాత్రం.. పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇదే తీవ్ర విమర్శల పాలయింది. భారతీయ జనతా పార్టీ ఏ తరహా దేశభక్తిని చూపిస్తుందో… తేలిపోతోందని… విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో.. తన పట్టు నిరూపించుకోవాలనుకుంటోంది. దానికి బీజేపీ ఎంచుకున్న ఆయుధం.. ఆయా రాష్ట్రాలకు అక్రమంగా చొరబడి వచ్చిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రజలే. దశాబ్దాలుగా… ఈశాన్య రాష్ట్రాల్లోకి వీరి వలస కొనసాగుతోంది. వారంతా.. ఓటు హక్కు కూడా పొందారు. నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంక్‌గా రూపాంతరం చెందారు. అయితే.. వారెవరికీ పౌరసత్వం లేదు. కొద్ది రోజుల కిందట… ఓ పౌరసత్వ రిజిస్టర్ ను.. విడుదల చేయడంతో… రేగిన వివాదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ మైనస్ పాయింట్‌ను సరిదిద్దుకోడానికి… అందరికీ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారు. ముస్లింలను మాత్రం దూరం పెట్టారు. నిజానికి ఈ వలసదారులకు వ్యతిరేకంగా..ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీలకు పార్టీలే పుట్టాయి. అసోంలో అసోం గణ పరిషత్ కూడా అలాంటిదే. అలాంటి పార్టీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ.. ఇప్పుడు… ఆయా పార్టీలను కాదని.. ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి వలసదారులకు.. పౌరసత్వం ఇస్తూ… చట్టం చేసింది. అందుకే..ఏజీపీ కూటమికి గుడ్ బై చెప్పింది.

హిందువులయినంత మాత్రాన.. ఇతర దేశాల నుంచి చొరబడి.. దేశంలోకి వస్తే.. పౌరసత్వం ఎందుకివ్వాలన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ముస్లింలకు ఎందుకివ్వకూడదన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తాయి. అయితే.. ఈ రెండు ప్రశ్నలు… చొరబాటుదారులను సమస్యగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల నుంచి రావు. ఈ సమస్య ప్రధానంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలు .. అసలు చొరబాట్లనే… సమస్యగా భావిస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం… హిందూ చొరబాటుదార్లను ఓటు బ్యాంక్‌గా చూసి… తమ దేశభక్తి ఎలా ఉంటుందో నిరూపించుకుందన్న విమర్శలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close