ఉప ఎన్నికల ముందు సిబీఐ విచారణ తెరాసకి ఇబ్బందే

సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికలు జరుగబోయే సమయంలో సిబీఐ అధికారులు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒక కేసు విషయంలో ప్రశ్నించడం తెరాసకు చాలా ఇబ్బందికరంగా మారింది. 2006సం.లో ఆయన కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ.ఎస్.ఐ. ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు అప్పగించకుండా విశాఖలోని మత్స్యశాఖలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారికి బాధ్యతలు అప్పగించారు. ఈకేసుపై దర్యాప్తు చేస్తున్న సిబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి ఆయనను ప్రశ్నించి వెళ్ళారు. ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే మరొక వివాదాస్పద నిర్ణయం కూడా తీసుకొన్నారు.నిబంధనలకు విరుద్దంగా సహారా సంస్థకు స్వంతంగా ప్రావిడెంట్ ఫండ్ నిర్వహణ చేసుకోవడానికి అనుమతించారు.దానిపై కూడా సిబిఐ విచారణ జరుగుతోంది.

ఇంతకాలం తెరాస నేతలు కాంగ్రెస్, తెదేపాలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించేవారు. ఓటుకి నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసారు. కానీ వారి ఎత్తులకు ఆయన వేసిన పైఎత్తులు వేయడంతో వారి పధకం ఫలించలేదు.ఇప్పుడు తమ ముఖ్యమంత్రే అంతకంటే పెద్ద కేసులో ఇరుక్కోవడంతో తెరాస నేతలకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది.

తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఇదే విషయం లేవనెత్తి సిబీఐ విచారణపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందా…లేదా? అనే విషయం ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఒకవేళ తమ ప్రశ్నకు జవాబు చెప్పకుండా మౌనం వహిస్తే కేసీఆర్ అవినీతికి పాల్పడినట్లుగానే భావిస్తామని అన్నారు. తెదేపా, బీజేపీ, వామ పక్షాలు కూడా ఈ విషయంలో కేసీఆర్ సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు తెరాస నేతలెవరూ జవాబు చెప్పుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ అంశం తప్పకుండా ప్రస్తావించడం ఖాయం. అదే జరిగితే తెరాస నష్టపోవచ్చును. కనుక నేడో రేపో దీనిపై కేసీఆర్ లేదా తెరాస ముఖ్యనేతలు ఎవరో ఒకరు ప్రజలకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close