ఫ్యాక్షన్ మార్క్ పాలన : ప్రతిపక్ష నేతలకూ నో సెక్యూరిటీ !

ఏపీలో నడిరోడ్డుపై హత్యాయత్నాలు చేసిన వాళ్లకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వారికి పోలీస్ స్టేషన్లలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాసమస్యపై పోరాడే ప్రతిపక్ష నేతలకు మాత్రం ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. ప్లాన్డ్‌గా కరెంట్ ఆపేసి… రాళ్ల దాడి చేస్తారు. అందుకు పోలీసులు సహకరిస్తారు. ఎక్కడికైనా వెళ్తూంటే.. హౌస్ అరెస్టులు చేస్తారు. ఇందు కోసం కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టించడానికి కూడా పోలీసుల సహకారం ఉంటుంది. ఏపీలో ఇప్పుడున్నది ఇదే పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలపై అయితే అరెస్టులు.. లేకపోతే దాడులు అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. ప్రతిపక్ష నేతలెవరూ స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేకపోవడం.. ఒక వేళ ఎక్కడికి వెళ్లినా వైసీపీ నేతలు ఉద్రిక్తలు సృష్టిస్తూండటంతో ఆ పర్యటనలన్నీ వివాదాస్పదమవుతున్నాయి. పోలీసుల తీరును ప్రశ్నించేలా చేస్తున్నాయి. మరో వైపు అందరూ ప్రభుత్వంపై వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను భయపెట్టేలా చేయడానికి ఇలా చేస్తోంది. వారు జనంలోకి వెళ్లకుండా చేయాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో జనవాణి చేయడానికి అంగీకరించలేదు. పవన్ కల్యాణ్‌ను నిర్బంధించి.. విశాఖ నుంచి విజయవాడకు తరలించేశారు. ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎక్కడికి వెళ్లినా ఉద్రిక్తతలు చోటుచేసుకుటున్నాయి. నందిగామ పర్యటనలో చంద్రబాబు లక్ష్యంగా విసిరిన రాయి.. సెక్యూరిటీ ఆఫీసర్‌కు తగిలింది. అదే చంద్రబాబుకు తగిలి ఉంటే..? . కొద్ది రోజుల కిందట సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడా రాళ్ల దాడులు జరిగాయి.

పోలీసులు భద్రత కల్పించాలి. కానీ .. ఘర్షణలు జరిగేలా చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల పాదయాత్ర జరుగుతున్న సమయంలో వారికి పోటీగా గర్జనలు నిర్వహించేలా సహకరించారు. ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. ఏపీలో ప్రతిపక్ష నేతలకు భద్రత కొరవడిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గడానికి కారణం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close