ఓటీ, బీపీ, ఓసీ బ్రాండ్‌లపై ఏపీలో నిషేధం

హైదరాబాద్: విజయవాడలో నిన్న ఉదయం కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయిన ఘటన నేపథ్యంలో ప్రముఖ మద్యం బ్రాండ్‌లయిన బ్యాగ్ పైపర్, ఓల్డ్ ట్యావర్న్, ఆఫీసర్స్ ఛాయిస్‌ బ్రాండ్‌లలోని నిర్ణీత బ్యాచ్‌లపై ఆంధ్రప్రదేశ్‌లో తాత్కాలిక నిషేధం విధించారు. ఈ బ్యాచ్‌ల శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. మరోవైపు, ఈ బార్‌లో నిన్న ఈ బ్రాండ్‌ల మద్యాన్ని సరఫరా చేయలేదని, ఈ బ్రాండ్‌ల పేరుతో కల్తీ మద్యాన్ని సరఫరా చేశారని ఒక వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే స్వర్ణ బార్ భాగస్వాములపై 304 ఏ,328 సెక్షన్‌ల కింద కేసు పెట్టారు. వీరిలో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు తల్లి బాల త్రిపురసుందరమ్మ కూడా ఉన్నారు. ఈ బార్‌ను నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ‘ఎమ్‌’ యొక్క సెల్లార్‌లో నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. కృష్ణలంక ప్రాంతం ఎక్సైజ్ సీఐను సస్పెండ్ చేశారు. ఈ సాయంత్రానికి మద్యం శాంపిల్స్‌పై ఎఫ్ఎస్ఎల్ నివేదిక రానుంది. మరోవైపు మల్లాది విష్ణును ఈ కేసులో 9వ నిందితుడిగా చేర్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close