పాక్ చేతిలో చస్తూ బతుకుదామా?

కాశ్మీర్లోని యురీలో ఆర్మీ స్థావరంపై దాడి చేసింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే అనడానికి ఆధారాల కోసం వెతుక్కోనవసరం లేదు. వాళ్ల తుపాకుల మీదున్న ముద్రలే అందుకు సాక్ష్యం. ఆదివారం తెల్లవారుజామున దాడి చేసిన ఉగ్రవాదులు, 17 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. చివరకు నలుగురు తీవ్రవాదులను ఆర్మీ కాల్చి చంపింది.

పాకిస్తాన్ అంతే. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. తనకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాలను చూపించినా అడ్డంగా ఖండిస్తుంది. ప్రపంచం ముందు గగ్లోలు పెడుతుంది. కాశ్మీర్లో దారుణాలు జరుగుతున్నాయని గొంతు చించుకుంటుంది. ఫిదాయీ దాడులకు ప్లాన్ చేస్తుంది. ఇవాళ జరిగిన ఇలాంటి దాడులే ఇక ముందు చేయిస్తుంది. ఏం చేసుకుంటారో చేసుకోండని భారత్ ను సవాలు చేస్తోంది. భారత్ మాత్రం సహనంతో ఊరుకుంటోంది. పాక్ ప్రమేయంపై ఆధారాలు సంపాదించడానికి చెమటోడ్చి కష్టపడుతోంది.

తాను ఎన్ని ఉగ్రదాడులు చేయించినా భారత్ ఏమీ చేయలేదని పాకిస్తాన్ నమ్మకం. యుద్ధం ప్రకటించడం భారత్ వల్ల కాదని పాక్ కు బాగా తెలుసు. భారత్ ఎప్పుడూ రక్షణాత్మక దేశమే. ఒకరు కొడితే పడుతుంది. లేదా దెబ్బలు తప్పించుకోవడానికి తంటాలు పడుతుంది. అంతేగానీ కొట్టాలనే ప్రయత్నం చేసేలోపే ఎదురుదాడి చేయడం భారత్ కు అలవాటు లేదు. పైగా పాకిస్తాన్ అణ్వస్త్రాలున్న దేశం. కాబట్టి తనమీద యుద్ధం ప్రకటిచే దమ్ము ధైర్యం భారత్ ప్రభుత్వానికి లేవన్నది పాకిస్తాన్ నమ్మకం. అందుకే, ఇక ముందు కూడా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి.

పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, టెర్రరిస్టులను పెంచి పోషిస్తోందని నెత్తీనోరూ బాదుకుంటే లాభం లేదు. మన సహనాన్ని చేతగాని తనంగా భావించే పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పకపోతే ఇలా ఇంకెన్ని దాడులు జరుగుతాయో, ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో చెప్పలేం. రోజూ చస్తూ బతికే కంటే యుద్ధమే మేలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. దేశంలో ఇవాళ చాలా మంది అభిప్రాయం అదే. అలాగని, యుద్ధం ప్రకటించడం చిన్న విషయం కాదు.

కనీసం కరకు వైఖరితో పాక్ ను కట్టడి చేయడం కూడా మనకు చేతకాదా? కాల్పుల విరమణ ఉల్లంఘన పాక్ మాత్రమే చేయగలదా? మనం చేయలేమా? నీవు నేర్పిన విద్యయే… అంటూ సరిగ్గా అదే తరహాలో ముందే దాడులు చేసి పాక్ ను డిఫెన్స్ లోకి నెట్టడం పెద్ద కష్టమేం కాదు. పాక్ గుక్కతిప్పుకోని విధంగా సైనిక దాడులు చేస్తే తాడోపేడో తేలిపోతుంది. అంతర్జాతీయ సమాజం మద్దతు మనకే ఉంది. యుద్ధం ప్రకటించకుండానే యుద్ధం చేయాలి. యుద్ధం అనే పేరుపెట్టకుండానే పాక్ ను ఓడించాలి. ఇలాంటి వ్యూహాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తేనే భారతీయులకు నిజమైన అచ్ఛే దిన్ వచ్చినట్టు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close