ఆ ఉస్మాన్ మావోడు కాడు లష్కరోడు: పాకిస్తాన్

జమ్మూలో ఉదంపూర్ వద్ద సరిహద్దు భద్రతా దళాల మీద దాడి చేసి పట్టుబడిన మొహమ్మద్ నవెద్ అలియాస్ ఉస్మాఖాన్ ఏమాత్రం జంకు గొంకు లేకుండా తాము పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ఏవిధంగా ప్రవేశించారో, ఎక్కడెక్కడ మజిలీలు చేసారో, పాకిస్తాన్ లో తను ఎక్కడ శిక్షణ తీసుకొన్నాడో వగైరా అన్ని వివరాలు పూసగుచ్చి చెపుతున్నాడు. ఇది వరకు ముంబై లో దాడులకు పాల్పడి అనేకమంది ప్రజలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసాబ్ పట్టుబడినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం అతను తమ దేశపౌరుడు కాడని బుకాయించింది. కానీ ఆ తరువాత సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తరువాత అంగీకరించక తప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఉస్మాన్ ఖాన్ విషయంలో కూడా అలాగే బుకాయిస్తోంది.

అటువంటి పేరుగల వ్యక్తి ఎవరూ తమ పౌరుల జాబితాలో లేరని ‘పాకిస్తాన్ జాతీయ డాటాబేస్ మరియు రిజిస్ట్రేషన్ అధారిటీ ‘దున్యా న్యూస్’ అనే పాకిస్తాన్ వెబ్ సైట్ కి తెలియజేసింది. బహుశః అతను లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకి చెందిన వ్యక్తి అయ్యి ఉండవచ్చని తెలిపింది. ఉస్మాన్ ఖాన్ కూడా తను పాకిస్తాన్ లో ఫైసలాబాద్ తన స్వస్థలమని, లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందానని చెపుతున్నాడు. అటువంటపుడు అతను ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తేనని ఒకపక్క దృవీకరిస్తూనే మళ్ళీ అతను తమ పౌరుడు కాదని పాకిస్తాన్ చెప్పడం హాస్యాస్పదం.

ఒక ఉగ్రవాది తమ దేశస్థుడని ఒప్పుకొంటే ఆ ఉగ్రవాదిని తయారు చేసింది, భారత్ పై దాడికి పంపింది కూడా తామేనని అంగీకరించినట్లవుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంగా పాక్ పేరొందింది. ఇప్పుడు ఉస్మాన్ ఖాన్ తమవాడేనని ప్రకటిస్తే అదే విషయం మరొక సారి దృవీకరించినట్లవుతుంది. అందుకే అతను తమ పౌరుడు కాదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. ప్రజల ప్రాణాలు బలిగొంటున్న ఒక ఉగ్రవాదిని తమ పౌరుడని చెప్పుకోవడానికే సిగ్గు పడుతున్నప్పుడు ఉగ్రవాదాన్ని ఎందుకు పోషించడం? ప్రపంచ దేశాల ముందు ఎందుకు సిగ్గుతో తల దించుకోవడం?

క్రిందటి సంవత్సరంలో ఒకసారి లష్కర్ ఉగ్రవాదులు ఇస్లామాబాద్ లో ఒక మిలటరీ స్కూల్లో ప్రవేశించి సుమారు 140 మంది అభం శుభం తెలియని విద్యార్ధులను వారి తరగతి గదుల్లోనే వరుసగా నిలబెట్టి అతి కిరాతకంగా కాల్చి చంపినప్పుడు ఒక్క పాకిస్తాన్ దేశమే కాదు భారత్ తో సహా యావత్ ప్రపంచ దేశాలు కన్నీరు కార్చాయి. “ఉగ్రవాదులలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటూ వేరే ఉండరని, ఉగ్రవాదులు ఎవరయినా నరహంతకులేనని” అప్పుడు పాకిస్థా ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా చెప్పుకొన్నారు. ఇక పాక్ గడ్డపై ఉగ్రవాదం అనేది లేకుండా చేస్తామని భీకర శపథం చేసి ఓ 50-60మంది ఉగ్రవాదులను ఉరి తీశారు కూడా.

కానీ ఏడాది తిరక్కుండానే అదంతా మరిచిపోయి మళ్ళీ యధాప్రకారం లష్కర్ ఉగ్రవాదులు తమ గడ్డపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చేతులు ముడుచుకొని చూస్తోంది. ఉస్మాన్ ఖాన్ తమ దేశ పౌరుడు కాడని పాక్ సర్దిచెప్పుకోవడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో అతను లష్కర్ ఉగ్రవాది అయ్యుండవచ్చునని చెప్పిన మరోముక్క తమ గడ్డపై నేటికీ ఉగ్రవాదుల శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని దృవీకరిస్తున్నట్లుంది.తమ స్వంత పిల్లలే ఉగ్రవాదానికి బలయిపోయినా కూడా పాక్ ప్రభుత్వానికి ఇంకా బుద్ది రాలేదు…మారలేదు..ఇక ఎన్నటికీ కూడా మారబోదని పాక్ ప్రకటనతో మరోమారు స్పష్టం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూల్స్ రంజన్.. సూపర్ కాన్ఫిడెన్స్

ఈవారం వస్తున్న ప్రామెసింగ్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ముందువరుసలో వుంది. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. రూల్స్ రంజన్ ఆ...

సిద్దార్థ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !

సిద్ధార్థ్ కి సినిమాలు కలసిరావడం లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు,. హిట్టు అనే మాట రావడం లేదు. ఇటివలే టక్కర్ అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ పై...

లోకేష్‌పై అసలు ఎఫ్ఐఆర్లే లేవని చెబుతున్న సీఐడీ

లోకేష్ ను అరెస్టు చేయడం ఖాయమని ఊగిపోయిన సీఐడీ ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదని చెబుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చి.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా ఢిల్లీ వెళ్లి .....

హిందీలో మార్కులు కొట్టేసిన రవితేజ

రవితేజ చక్కని హిందీ మాట్లడతారు. ఆయన నార్త్ లో కొన్నాళ్ళు వుండటం వలన హిందీ అలవాటైయింది. ఇప్పుడీ భాష 'టైగర్ నాగేశ్వరరావు' కోసం పనికొచ్చింది. రవితేజ కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close