పాక్‌ నాటకాలు.. పరాజయ భయంతోనే!

ఎక్కడో పరాయిగడ్డ మీద భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ ఓడిపోయినందుకే.. స్వదేశంలో క్రీడాభిమానుల్లోని అతివాదులకు ఎలా సంజాయిషీ చెప్పుకోవాలో.. వారి దాడులనుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని స్థితిలో పాకిస్తాన్‌ కొట్టు మిట్టాడుతున్నది. బంగ్లాదేశ్‌ చేతిలో కూడా ఓటమి చవిచూసిన ఆ పాకిస్తాన్‌ జట్టు.. మరోసారి మ్యాచ్‌ జరిగినా సరే.. ఇప్పుడు అత్యద్భుతమైన ఫాంలో ఉన్న భారత జట్టును ఓడించే పరిస్థితి లేదన్నది స్పష్టం. ఇలాంటి నేపథ్యంలో.. భద్రతకు సంబంధించి భారత్‌ సరైన హామీలు ఇవ్వలేదంటూ.. ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో పాకిస్తాన్‌ ఆడవలసి ఉన్న మ్యాచ్‌ను రద్దు చేసుకోవడానికి ఆదేశం క్రికెట్‌ బోర్డు నిర్ణయించడం వివాదాస్పదంగా మారుతున్నది. ఆడలేక మద్దెల ఓడన్న చందంగా.. భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేం అనే భయంతోనే.. పాకిస్తాన్‌ ఇలా భద్రత ముసుగులో నాటకాలు ఆడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య హిమాచల ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఒక మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే ధర్మశాలలో భద్రత ఏర్పాట్లు ఎలా ఉంటాయో.. తమ జట్టుకు ఎలాంటి రక్షణ ఉంటుందో ఏమో అంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అతి భయాన్ని ప్రదర్శించింది. ఆమేరకు ఇక్కడి భద్రత ఏర్పాట్లను సమీక్షించడానికి ఇద్దరు పాక్‌ అధికార్లను కూడా పంపింది. వారు వచ్చి ధర్మశాల క్రికెట్‌ స్టేడియంను కూడా సందర్శించి.. అక్కడి పోలీసు అధికారులతో కూడా సమావేశం నిర్వహించి.. తొలుత సంతృప్తి చెందినట్లు కనిపించినా.. తర్వాత.. నో అన్నారు.

పాక్‌ అభ్యంతరాల నేపథ్యంలో మ్యాచ్‌ వేదికను ధర్మశాలనుంచి కోల్‌కతకు మార్చడానికి బీసీసీఐ ఒప్పుకుంది. కోల్‌కత్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఉంటే ఆడుతాం అని పాక్‌ అధికారులే కోరారని, ఆ మేరకు కోల్‌కతను సిద్ధం చేయడానికి ఓకే అని ప్రకటించింది. అంతలో ఏమైందో గానీ.. భారత్‌ భద్రతకు సంబంధించి హామీ ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో పాక్‌ జట్టు ఇక్కడ పర్యటించడం వాయిదా పడినట్లేనని వార్తలు వస్తున్నాయి. పాక్‌ అధికారులు కోరినట్లుగా వేదిక మార్చినా, భద్రత గురించి పూర్తి హామీ ఇచ్చినా.. ఇలా మాట మార్చడం గురించి బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లుసమాచారం.

ఏది ఏమైనప్పటికీ.. భారత్‌తో టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ ఆడాలంటేనే పాకిస్తాన్‌ భయపడిపోతున్నదని దీన్ని బట్టి అర్థమవుతోంది. నిజానికి వారు బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయినా.. ఆ దేశంలో మనగలరేమో గానీ.. భారత్‌ చేతిలో ఓడిపోతే.. తీవ్రమైన ప్రజా ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే పరాజయ భయంతో వారు మ్యాచ్‌కు రాకుండా ఈ నాటకాలు ఆడుతున్నారని అంతా అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close