కిర‌ణ్ కుమార్ రెడ్డికి ప‌ల్లంరాజుతో రాయ‌బారం..!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆఖ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయ ప‌యనం ఎటు అనే ప్ర‌శ్న ఎప్ప‌ట్నుంచో అలానే ఉంది. ఇప్పుడు నల్లారి రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబంధించిన మ‌రో టాక్ తెర మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పున‌ర్వైభ‌వానికి న‌డుం బిగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే ల‌క్ష్యంతో ఏపీకి కొత్త వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ గా ఉమెన్ చాందీని నియమించారు. ఆయ‌న రంగంలోకి దిగారు, పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరాతో కూడా స‌మావేశ‌మ‌య్యారు. ఇప్ప‌టికిప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చి చేర‌బోయే నేత‌లంటూ ఎవ్వ‌రూ లేరు కాబ‌ట్టి, గ‌తంలో పార్టీ వీడిన నేత‌ల్నే తిరిగి ఆహ్వానించాల‌నే కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. దీన్లో భాగంగా తెర మీదికి వ‌చ్చిన పేరు… న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పార్టీ వీడిన నాయ‌కుల్ని వెన‌క్కి పిలిచే పనిలో ప‌డింది కాంగ్రెస్‌. అయితే, ముందుగా.. ఏ పార్టీలోనూ చేర‌కుండా, త‌ట‌స్థంగా ఉండిపోయిన నేత‌ల‌పై దృష్టి పెడుతున్న‌ట్టు స‌మాచారం. ఇలాంటివారికి సంబంధించిన ఒక జాబితా కూడా సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఒప్పించే బాధ్య‌త‌ను మాజీ మంత్రి ప‌ల్లంరాజుకు అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. అవ‌స‌ర‌మైతే తాను కూడా లైన్లోకి వ‌స్తాన‌నీ, కిర‌ణ్ తో మాట్లాడ‌తాన‌ని ఉమెన్ చాందీ భ‌రోసా ఇచ్చార‌ట‌. రాహుల్ గాంధీతో ఏపీ ముఖ్య‌నేత‌ల భేటీ సంద‌ర్భంగా కిర‌ణ్ కుమార్ రెడ్డి పేరు ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. కిర‌ణ్ వ‌స్తే బాగుంటుంద‌ని ఏపీ నేత‌లు ప్ర‌తిపాదించ‌డంతో, రాహుల్ కూడా ఓకే అన్న‌ట్టు చెబుతున్నారు.

ప‌ల్లంరాజుకు న‌ల్లారితో సాన్నిహిత్యం ఉంది కాబ‌ట్టి, ఆయ‌న‌కి ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, ఇక్క‌డ స‌మ‌స్య ఏంటంటే… కిర‌ణ్ కుమార్ సోద‌రుడు కిషోర్ కుమార్ ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీలో చేరారు. త‌మ్ముడు టీడీపీలో చేరార‌నే భేదాభిప్రాయం కూడా కిర‌ణ్ కు లేదు. పైగా, త‌న‌కు అన్న‌య్య ఎప్పుడూ అండ‌గానే ఉంటార‌ని కిషోర్ అప్పుడే చెప్పారు. వాస్త‌వం మాట్లాడుకుంటే.. కిర‌ణ్ కి క్షేత్ర‌స్థాయిలో సోద‌రుడి అండ‌దండ‌లు ఎంత ముఖ్య‌మైన‌వో అంద‌రికీ తెలిసిన‌వే! ఈ నేప‌థ్యంలో కిర‌ణ్ ను ప‌ల్లంరాజు ఏం చెప్పి బుజ్జ‌గిస్తార‌నేది వేచి చూడాలి. కిర‌ణ్ పాటు కొణ‌తాల రామ‌కృష్ణ‌, హ‌ర్ష‌కుమార్ వంటి నేత‌ల్ని సొంత గూటికి ర‌ప్పించే ప్ర‌య‌త్నం ముమ్మ‌రంగానే పార్టీ ప్రారంభించింది. ఇది ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close