తిరుపతి టీడీపీ అభ్యర్థి ఇంత వరకూ నోరు తెరవలేదేమి..!?

తిరుపతి ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ఖరారు చేశారు. వారం రోజులు గడుస్తున్నా.. ఆమె వైపు నుంచి అధికారిక స్పందన రాలేదు. దీంతో ఆమె పోటీకి విముఖత చూపుతున్నారన్న ప్రచారాన్ని ఇతర పార్టీలు ప్రారంభించాయి. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయింది. అయితే.. తమ కుమార్తె వివాహ నిశ్చితార్థం కారణంగానే సైలెంట్‌గా ఉన్నామని.. ఎన్నికల బరిలోకి దిగడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామంటూ.. వారు ఇద్దరూ వెళ్లి.. మాజీ మంత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డికి స్పష్టం చేశారు. తమ అభ్యర్థిత్వంపై అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని.. రేపో ఎల్లుండో చంద్రబాబును కలిసిన తర్వాత.. ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తామని వారు సోమిరెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తోంది.

నవంబర్ 28న తిరుమలలో దర్శనం చేసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పనబాక లక్ష్మి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి టీడీపీ తరపునే పోటీ చేసిన పనబాక లక్ష్మి.. రెండులక్షలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. తెలుగుదేశం కార్యక్రమాల్లోనూ పాల్గొన్నట్లుగా ఎక్కడా లేదు. అయితే.. అభ్యర్థిగా అమెకే చాన్సిచ్చారు చంద్రబాబు. అలా ఖరారు చేసే ముందు ఆమెతో మాట్లాడారో లేదో స్పష్టత లేదు కానీ..ఆమె మాత్రం.. ఇప్పటి వరకూ మౌనం పాటిస్తున్నారు.

అయితే అభ్యర్థితో సంబంధం లేకుండా.. ఏడు నియోజకవర్గాలకు సంబంధించి గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ ప్రత్యేకంగా కమిటీల్ని నియమించి ప్రచార వ్యూహాన్ని టీడీపీ అధినేత ఖరారు చేస్తున్నారు. ఇందు కోసం టీడీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు. వారు సమన్వయం చేయనున్నారు. టీడీపీ అభ్యర్థి సైలెంట్‌గా ఉంటే..ఇతర పార్టీలు లేనిపోని ప్రచారాలు చేస్తాయని.. ఆమె ఎంత యాక్టివ్ అయితే అంత ప్లస్ అని.. ఆ పార్టీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close