‘పప్పు’…..గిల్లి మరీ గొడవను పెంచుకున్నారా?

మొదటి సారి సోషల్ మీడియాపైన లోకేష్ విమర్శలు చేసినప్పుడే… కరెక్ట్ కాదని చెప్పి నారా వారి అబ్బాయికి చాలా మంది సలహాలు ఇచ్చారు. కానీ లోకేష్ మాత్రం తనపైన వస్తున్న విమర్శలకు బాగా హర్ట్ అయినట్టున్నాడు. పట్టుదలగా తీసుకున్నాడు. ఈ విషయంలో చంద్రబాబు కూడా లోకేష్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడట కానీ లోకేష్ మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నాడన్న వార్తలు వచ్చాయి. ఎవరు ఎన్ని చెప్పినా సోషల్ ీమీడియా విమర్శలపై అంతు చూడాల్సిందే అనే రేంజ్‌లో రెచ్చిపోయాడు లోకేష్. కానీ అందరూ ఊహించినట్టుగానే ఆ గిల్లుడు కార్యక్రమం కాస్తా బూమరాంగ్ అయిందన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో లీడర్ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రెచ్చిపోయి కామెంట్స్ చేయడమనేది టిడిపి సానుభూతిపరులతోనే ప్రారంభమయింది అన్న మాట నిజం. అప్పట్లో వైఎస్ జగన్‌పై, షర్మిళపై చేసిన పరుష కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. టిడిపి భజన మీడియా స్పీడ్‌కి బ్రేకులు వెయ్యాలంటే సొంత మీడియా ఉండాల్సిందే అని చెప్పి సాక్షిని ప్రారంభించిన జగన్…సోషల్ మీడియా విషయంలో అలానే రియాక్ట్ అయ్యాడు. పైకి ఎవ్వరూ చెప్పరు కానీ టిడిపికి, వైకాపాకి కూడా సోషల్ మీడియాలో పార్టీ కోసం పనిచేస్తున్న పెయిడ్ ఎంప్లాయిస్ ఉన్నారన్నది నిజం. కానీ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం టిడిపి జనాల కంటే వైకాపా జనాలు కాస్త స్పీడ్ అయ్యారు. అంతా కూడా స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మహిమ అని చెప్తున్నారు. ఇక టిడిపి వెనక పడిపోవడానికి గుజరాత్ టీం కారణమని టిడిపి భజన పత్రిక ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా కామెంట్స్ విషయంలో కొన్ని హద్దులు మీరి మరీ వైకాపా జనాలు కామెంట్స్ చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. విలువలను అనుసరించే నాయకుడే అయితే ఆ కామెంట్స్‌కి వైఎస్ జగన్ కూడా అడ్డుచెప్పి ఉండాలి. కానీ జగన్-చంద్రబాబులిద్దరిదీ కూడా టిట్ ఫర్ టాట్ తరహా రాజకీయం. దెబ్బకు దెబ్బ కొట్టాలన్న ఉద్ధేశ్యంతో అన్ని హద్దులనూ చెరిపేస్తున్నారు. లోకేష్‌ని హర్ట్ చేయాలి, ఇమేజ్ డ్యామేజ్ చేయాలి అన్న టార్గెట్‌తోనే వైకాపా జనాలు రెచ్చిపోయారన్నది నిజం. అయితే ఆ దాడిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో మాత్రం లోకేష్ తప్పటడుగులు వేశాడు. తనకు నష్టం చేస్తోంది కాబట్టి ఆ వ్యవస్థనే లేకుండా చేసేద్దాం అనే స్థాయిలో రెచ్చిపోయాడు. ఆ అత్యుత్సాహమే ఇప్పుడు లోకేష్‌కి మైనస్ అయింది. అంతకుముందు వరకూ ‘పప్పు’ అంటే ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఇఫ్పుడు మాత్రం తెలుగువాళ్ళందరికీ తెలిసేలా చేసుకున్నాడు లోకేష్. వైఎస్ జగన్ పార్టీ నాయకులతో పాటు, కాంగ్రెస్ నాయకులు, ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా సీన్‌లోకి వచ్చి ‘పప్పు’ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతుండడంతో ఈ వ్యవహారం 2019 ఎన్నికల వరకూ కూడా కొనసాగేలానే కనిపిస్తోంది. మీడియాని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో చంద్రబాబుని మించిన తెలివితేటలున్న నాయకుడు ఈ దేశంలోనే లేడు అన్న మాట వాస్తవం. అలాంటి చంద్రబాబు వారసుడు కెరీర్ ప్రారంభంలోనే మీడియా విషయంలో ఇంత రాంగ్ స్టెప్ వేయడం ఏంటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close