తల్లిదండ్రుల ఆందోళన, వృథా ప్రయాసేనా?

ప్రయివేట్ స్కూళ్లలో అడ్డగోలుగా ఫీజులు పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లో మహా ధర్నా చేపట్టారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజుల వల్ల తమ బడ్జెట్ ఎలా తల్లకిందులు అవుతోందో చాలా మంది తల్లిదండ్రులు ఆవేదనగా వివరించారు.

హైదరాబాదులోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులు ఇష్టం వచ్చినట్టు పెంచడం మామూలైపోయింది. రాజధానిలో అయితే ఇంటర్నేషనల్, కాన్సెప్ట్ టెక్నో పేరుతో, అదనపు హంగుల పేరుతో వేలకు వేలు ఫీజు గుంజుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టం కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు రకాలుగా ప్రభుత్వం విఫలమైంది.

పిల్లలందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ విధి. ఈ విషయంలో మొదటినుంచీ ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతూనే ఉన్నాయి.
టీచర్ల కొరత, భవనాల కొరత, ఫర్నిచర్ కొరతతో విద్యార్థులు సర్కారు బడిలో చదవానికి వెనుకాడే పరిస్థితిని తీసుకొచ్చారు. టీచర్లకు భారీగా వేతనాలను పెంచినా, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఎందుకు ఆకర్షించలేక పోతున్నారో ప్రభుత్వం జవాబు చెప్పాలి. మధ్యాహ్న భోజనం కారణంగా కొద్ది మంది పేద పిల్లలు మాత్రం సర్కారు బడికి పోతున్నారు. ఒకప్పుడు సంపన్న కుటుంబాల పిల్లలు కూడా సర్కారు బడిలోనే చదివారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇందుకు సరైన చట్టాలు చేయడం, వాటిని పక్కాగా అమలు చేయడం సర్కారు బాధ్యత. కానీ రాజకీయ నాయకులకు, అధికార పార్టీ వారికి లేదా వారికి కావాల్సిన వారికి విద్యా సంస్థలు ఉండటం వల్ల ప్రభుత్వాలు చూసీ చూడనట్టు ఊరుకున్నాయనే విమర్శలు కొత్త కాదు.

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన టీచర్లుంటారు. ప్రయివేట్ స్కూళ్లలో చాలా మంది ఇంటర్ , డిగ్రీ చదివిన వాళ్లే టీచర్లుగా పాఠాలు చెప్తారు. బీఎడ్, టీటీసీ చదివిన వాళ్లే విద్యను బోధించాలి. కానీ ప్రయివేట్ స్కూళ్లలో అందరు టీచర్లూ ఇలా అర్హతలున్న వారు కాదు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

ప్ర్రయివేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడం వెనుక తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. పిల్లల పట్ల అతి శ్రద్ధ వల్ల స్కూల్ యాజమాన్యాలకు అలుసైపోతున్నారు. ఫలానా స్కూల్లో చేర్పిస్తేనే రేపే ఐఐటి సీటు వస్తుందనో కలెక్టర్ అయిపోతారనో భ్రమల్లో పడిపోయి అడ్మిషన్ల కోసం పోటీ పడతారు. నిజానికి, విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకోవడంలో స్వతహాగా ఉండే ప్రతిభే ముఖ్యం. స్కూల్లో మెళకువలు చెప్తారు. చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలో, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో చెప్పడం వరకే బడి పాత్ర. స్వతహాగా అవగాహన శక్తి లేని విద్యార్థులను ఈ ప్రయివేట్ పాఠశాలలు ఏమాత్రం ఉద్ధరించలేవనే వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించడం లేదు. అదే యాజమాన్యాలకు అస్త్రంగా మారింది.

ఇటీవల హైటెక్ సిటీ వద్ద, శనివారం ఇందిరా పార్క్ వద్ద, అంతకు ముందు మరోచోట్ తల్లిదండ్రుల ధర్నాలు జరిగాయి. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచండి, మా పిల్లల్ని చేర్పిస్తామన్న తల్లిదండ్రులు ఎంత మంది? ఇక్కడే తెలుస్తోంది. వీళ్లు ఎంత గొంతు చించుకున్నా మళ్లీ ప్రయివేట్ స్కూళ్ల జులుంను భరించడానికే ఇష్ట పడతారని. ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకుంటుందనే నమ్మకం ఎలాగూ లేదు. కాబట్టి రేపు స్కూళ్లు తెరవగానే షరా మామూలే!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close