పార్లమెంట్‌ను కుదిపేసిన రోహిత్ ఆత్మహత్య అంశం

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశం పార్లమెంట్‌ను దూకింది. పార్లమెంట్ ఉభయ సభలలో ఈ అంశం మార్మోగిపోయింది. రాజ్యసభలో ఈ విషయంపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ చర్చకు పట్టుబట్టారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన న్యాయవిచారణ కమిటీలో దళితులకు స్థానం కల్పించాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఇతర విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ కమిటీలో దళిత సభ్యుడు కూడా ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆరెస్సెస్ భావజాలాన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో రుద్దాలని చూస్తోందని మాయావతి ఆరోపించారు. మరోవైపు లోక్‌సభలో ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రోహిత్ దళితుడు కాదన్న అంశాన్నే ఎక్కువగా ప్రచారం చేశారని, అతను దళితుడు కాకుంటే మంత్రులు చేసిన తప్పు ఒప్పవుతుందా అని లోక్ సభలో ప్రశ్నించారు. రోహిత్‌ను హెచ్‌సీయూలో కళాశాల, వసతి గృహంనుంచి దూరంగా ఉంచారని, అతను ఒక టెంట్‌లో ఉండాల్సిన పరిస్థితి కల్పించారని ఆరోపించారు. రోహిత్ మృతి ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close