సీఎం జగన్ ప్రెస్‌మీట్లలోనూ మీడియాపై వివక్ష..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్లకు ఓ సెక్షన్ మీడియాను మాత్రమే అనుమతిస్తున్నారు. వైసీపీ పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు.. ఓ సెక్షన్ మీడియాకు అనుమతి ఉండదు. అయితే.. అది వారిష్టం. కానీ ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటికీ.. గుర్తింపు పొందిన మీడియా సంస్థలన్నింటినీ ఆహ్వానించారు. అప్పుడే ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రభుత్వం తాము చెప్పాలనుకున్న విషయం.. ప్రజలందరికీ చేరాలంటే.. అందరూ కలసికట్టుగా చెబితేనే.. అది చేరుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఇలా కొంత మంది మీడియా ప్రతినిధుల్ని దూరంగా పెట్టడం గతంలో ఎప్పుడూ లేదు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సాక్షి మీడియా జర్నలిస్టుల్ని.. ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచలేదు.

అలా వచ్చిన జర్నలిస్టులు.. ప్రెస్‌మీట్‌లో అలజడి రేపే ప్రయత్నం చేసినా.. వారికి ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇచ్చారు. వారికి ఘాటుగానో.. నీటుగానే సమాధానం ఇచ్చేవారు. అంతే కానీ.. అసలు వారిని ప్రెస్‌మీట్‌కు .. ప్రభుత్వ కార్యక్రమాల కవరేజీకి రాకుండా చేయాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శైలి మాత్రం భిన్నంగా ఉంది. ఆయన ప్రెస్‌మీట్లు పెట్టడమే తక్కువ. పది నెలల పాలనా కాలంలో రెండు సార్లు మాత్రమే ప్రెస్‌మీట్ పెట్టారు. రెండు సార్లు చాలా పరిమిత సంఖ్యలో జర్నలిస్టుల్ని పిలిచారు. అయితే..ఆ జర్నలిస్టులకు కూడాప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వలేదు.

తాను చెప్పాలనుకున్నది చెప్పేసి.. వెళ్లిపోయారు. ఇంత మాత్రం దానికి ప్రెస్‌మీట్లు దేనికని… వీడియో షూట్ చేసి పంపిస్తే సరిపోతుంది కదా… అన్న కామెంట్లు మీడియా ప్రతినిధుల్నించి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరని.. తెలిసి.. ఇలా ప్రశ్నలు అడుగుతారనుకున్న వారందర్నీ ముందుగానే కట్టడి చేస్తున్నారంటున్నారు. ఇది మీడియా వర్గాలలోకి మరింత నెగెటివ్‌గా వెళ్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీడియాపై వివక్ష చూపిస్తే.. తర్వాత అది అవాంఛనీయ పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close