ఫిక్స్‌: సాయిధ‌ర‌మ్‌తో ప‌ర‌శురామ్‌

గీత గోవిందంతో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయాడు ప‌ర‌శురామ్‌. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ప‌ర‌శురామ్ మీడియం రేంజు హీరోలకే ప‌రిమితం. ఇప్పుడు స్టార్ హీరోలు సైతం ప‌ర‌శురామ్ కోసం ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం త‌ర‌వాత ఎవ‌రితో సినిమా చేస్తాడు? అనే ఆస‌క్తి నెల‌కొంది. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ద‌గ్గ‌ర ప‌ర‌శురామ్ అడ్వాన్స్ తీసుకున్నాడు. అందుకే గీత గోవిందం హిట్ట‌యిన వెంట‌నే `విష్ణుతో సినిమా` అనేఫీల‌ర్ వ‌దిలారు. కానీ… అప్ప‌టికే గీతా ఆర్ట్స్‌తో మ‌రో సినిమా చేయ‌డానికి ప‌ర‌శురామ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకే `గీత గోవిందం` త‌ర‌వాత కూడా గీత కాంపౌండ్‌లోనే ఉండాల్సివ‌స్తోంది. ప‌ర‌శురామ్‌కి బ‌న్నీతో సినిమా చేయాల‌ని కోరిక‌. కానీ ఇప్పుడు బ‌న్నీ రెడీగా లేడు. త‌న క‌థ‌లు, త‌న ద‌ర్శ‌కుల‌తో బిజీగా ఉన్నాడు. అందుకే ఈలోగా మ‌రో సినిమా చేయాల్సివ‌చ్చింది. ఈసారి ప‌రశురామ్ సాయిధ‌ర‌మ్ తేజ్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. క‌థ కూడా దాదాపుగా ఓకే అయిపోయింది. స్క్రిప్టు ప‌నులు కూడా ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుస ఫ్లాపుల్లో ఉన్నాడు. త‌న‌కు ఓ సూప‌ర్ హిట్ కావాలి. క‌నీసం త‌న సినిమాకంటూ ఓ బ‌జ్ మొద‌ల‌వ్వాలి. అలా జ‌ర‌గాలాలంటే ప‌ర‌శురామ్ లాంటి ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డ‌మే క‌రెక్టు. మొత్తానికి గీతా ఆర్ట్స్… ప‌ర‌శురామ్‌ని అట్టి పెట్టుకోగ‌లిగింది. త‌మ కుటుంబంలోని హీరోతోనే ఓ సినిమా ఫిక్స్ చేసేసింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com