ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థి గురించి ఆలోచిద్దాం : పవన్ కల్యాణ్

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. అన్ని పద్దతులు బాగుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. త్రిముఖ పోరులో బలి అవడానికి సిద్ధంగా లేనని ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని ప్రకటించారు. టీడీపీ నేతలను సీఎం చేసేందుకు జనసేన లేదు.. మన బలాన్ని మనం బేరీజు వేసుకోవాలి.. అవసరమైనప్పుడు తగ్గడమే కాదు, బెబ్బులిలా తిరగబడాలని పిలుపునిచ్చారు.

గత ఎన్నికల్లో 30-40 సీట్లు వచ్చుంటే ఇప్పుడు సీఎం సీటు వచ్చే తీరాలి.. కానీ సీట్లు లేవప్పుడు ఏం చేయగలం..? ఓ ప్రాంతానికే పరిమితం అయిన ఎంఐఎంకు ఏడు స్థానాలు వస్తాయి.. రాజకీయాల్లో తన ప్రభావం చూపుతోంది.. కానీ జనసేనకు కనీసం 10 స్థానాలైనా రాకుంటే ఎలా..? ఎంఐఎంలా కాదు.. కనీసం విజయకాంత్‌ లా కూడా మనల్ని గెలిపించలేదన్నారు. అని ప్రశ్నించారు. వైసీపీకి జనసేన అంటే ఎందుకు భయం.. నేను మాట్లాడగానే వైసీపీ బుడతలు వచ్చి మాట్లాడతారు.. వైసీపీ బుడతలను సీఎంను చేయవచ్చు కదా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

అభిమానం ఓట్లుగా మారితేనే సీఎం అవుతారు.. అజాత శత్రువును కాను.. కొంత మందికి నన్ను శత్రువుగా చూసినా ఓకే.. నన్ను ఎంత విమర్శిస్తే.. అంతగా రాటుతేలుతానన్నారు. పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి రావడం ఎన్టీఆర్ వల్ల అయిందేమో.. కానీ, నా వల్ల అవుతుందని నేను ఏనాడూ భావించలేదు. నినాదాలు చేస్తేనో.. గజ మాలలు వేస్తేనో.. సీఎం కాలేరు.. ఓట్లేస్తేనే సీఎం అవుతారని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడే పవన్ కల్యాణ్‌ గుర్తోస్తాడేమో..? మోసం చేసే వాళ్లే జనానికి నచ్చుతారేమో..? అయినా నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం.. ఈ రాష్ట్రం కోసం నేను నిలబడతానని పవన్ స్పష్టం చేశారు.

పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ బలమైన మెజార్టీతో గెలుస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల తక్కువ అంచనా వేయవద్దన్నారు. సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత మాట్లాడుకుందామన్నారు. పొత్తులపై విధివిధానాలు త్వరలో తేలుతాయని స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close