తన తిక్క చూపిస్తున్న పవర్ స్టార్

టాలీవుడ్ క్రేజీ స్టార్ ఎవరంటే క్షణం ఆలోచించకుండా వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ స్టామినా ఇది అని కొలవాలని చూసే వ్యాపకం లేదంటే అతిశయోక్తి కాదేమో టాలీవుడ్ లో అత్యధిక సంఖ్యలో అభిమానులున్న హీరో పవన్ కళ్యాణ్ అది ఎవరి నమ్మినా నమ్మక పోయినా నిజం. సినిమాలు తీయడం మొదలు పెట్టిన నాటి నుండి తన కంటూ ఒక సరికొత్త స్టైల్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చి పవర్ స్టార్ గా మెగా అభిమానుల ముందు సగర్వంగా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తన సినిమాల్లో కనపడుతుంది అని చాలా మంది చెబుతుంటారు..

అయితే నాక్కొంచం తిక్కుంది కాని దానికో లెక్కుంది అన్న పవర్ స్టార్ ఆ డైలాగ్ చెప్ప గలిగే కెపాసిటీ తనకే ఉందని నిరూపించాడు. చూడప్పా సిద్ధప్పా సింహం నేను ఒకటే అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా మిగతాదంతా సేమ్ టూ సేమ్ అంటూ తన ఖలేజా గురించి చెప్పినా పవర్ స్టార్ వల్లే అవుతుంది. అయితే ప్రస్తుతం చేస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ బాగా చొరవ చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కథ కథనాలు తనే రాసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా కోసం పోరాట సన్నివేశాలు అదేనండి ఫైట్స్ కూడా తానే కంపోజ్ చేస్తున్నాడట.

సినిమా పట్ల అన్ని రంగాల్లో అభిరుచి ఉండటం మంచిదే కాని ఇదవరకు తను చొరవ తీసుకున్న సినిమాలు జానీ, గుడుంబా శంకర్ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. మరి అలా ఈ సర్ధార్ గబ్బర్ సింగ్ కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత పవర్ స్టార్ మీదే ఉంది. మొత్తానికి మళ్లీ తన తిక్క చూపిస్తున్న పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఈసారి సూపర్ సక్సెస్ కొట్టేట్టు ఉన్నాడు. పవర్ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయిన బాబీ పేరుకి సర్దార్ గబ్బర్ సింగ్ కి దర్శకుడిగా పనిచేస్తున్నా అన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని వస్తున్న రూమర్. మరి దీనికి పవర్ స్టార్ ఎలా సమాధానమిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close