పవన్ పోటీ చేసే రెండు చోట్లా ఆ సామాజిక వర్గం హవా..?

భీమ‌వ‌రం, గాజువాక నియోజ‌కవ‌ర్గాల నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పోటీ చేసే రెండు స్థానాలూ ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి ప్రాంతాల నుంచి ఎంచుకోవ‌డం విశేషం! మేధావుల‌తో ఏర్పాటైన క‌మిటీ ఇచ్చిన సూచ‌న‌ల ప్ర‌కార‌మే ప‌వ‌న్ ఈ స్థానాల్లో పోటీకి సిద్ధ‌మ‌య్యార‌ని ప్ర‌క‌టించారు. అయితే, సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం ప‌రంగా చూసుకుంటే… ఆ ప‌రిస్థితిని కూడా అంచ‌నా వేసే స‌ద‌రు క‌మిటీ ఈ స్థానాల‌ను ప‌వ‌న్ పోటీకి ఆప్ష‌న్లుగా ఎంపిక చేసిందా అనే అభిప్రాయం కలుగుతోంది

భీమ‌వ‌రంలో సాధార‌ణంగా రాజులను పోటీకి దించాల‌ని పార్టీలు అనుకుంటాయి. కానీ, ప‌వ‌న్ స్వ‌యంగా బ‌రిలోకి దిగుతున్నారు. 2004, 2009, 2014… ఈ మూడు సార్వ‌త్రిక ఎన్నిక‌లను వ‌రుస‌గా ఒక్క‌సారి వెన‌క్కి తిర‌గేసి చూస్తే… ఈ నియోజ‌క వ‌ర్గంలో మూడుసార్లూ కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారే గెలిచిన ప‌రిస్థితి ఉంది! అంత‌కుముందు ఓ రెండుసార్లు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారు గెలిచిన సంద‌ర్భాలున్నాయి. నియోజక వర్గాల పునర్విభజన తరువాత కూడా కాపు సామాజిక వ‌ర్గం సంఖ్యే అక్క‌డ ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పాలి. ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న రెండో నియోజ‌క వ‌ర్గం గాజువాకలో కూడా దాదాపు ఇలాంటి ప‌రిస్థితే ఉంది. అక్కడ కూడా వారి సంఖ్యే ఎక్కువ. చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ అక్క‌డ అప్ప‌ట్లో బాగా బ‌లంగా ఉండేది. ఆ నియోజ‌క వ‌ర్గంలో ల‌క్ష‌కుపైగా స‌భ్య‌త్వాలు న‌మోద‌య్యాయి అంటున్నారు!

విశ్లేషాత్మ‌కంగా చూసుకుంటే… ఈ సానుకూల ప‌రిస్థితుల‌ను ముందుగానే అంచ‌నా వేసి ఈ రెండు స్థానాల‌నూ ప‌వ‌న్ ఎంచుకున్నారా అనే అభిప్రాయం స‌హ‌జంగానే క‌లుగుతుంది. అయితే, ఈ నియోజ‌కవ‌ర్గాల ఎంపిక త‌న నిర్ణ‌యం కాద‌నీ, కమిటీకే తుది నిర్ణ‌యం వ‌దిలేశాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్నారు. స‌రే, నిర్ణ‌యం ఏదైనా ఎవ‌రిదైనా భీమ‌వ‌రం, గాజువాక‌ల నేప‌థ్య‌మైతే అది. ఇక్క‌డే ప‌వ‌న్ పోటీకి ఎందుకు దిగుతున్నారా అని ఆలోచించేవారికి… ముందుగా కంటికి క‌నిపించే చ‌రిత్ర అది! సామాజిక వ‌ర్గాల ముద్ర‌కు అతీతంగా జ‌న‌సేన పార్టీని అంద‌రికీ చేరువ చెయ్యాల‌న్న‌ది ప‌వ‌న్ ల‌క్ష్యం అనడంలో సందేహం లేదు. అయితే, ఇలాంటి అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ప‌వ‌న్ నిర్ణ‌యాలు ఉంటే… ఆ ల‌క్ష్యంపై ఇత‌ర చ‌ర్చ‌ల‌కు ఆస్కారం లేని ప‌రిస్థితి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close