అమరావతి కదలదు సరే…అందుకున్న ప్లాన్‌ ఏమిటి?

ఏపీలో కొత్తగా పొత్తు పెట్టుకున్న జనసేన-బీజేపీ పార్టీలు అమరావతే శాశ్వత రాజధాని అని చెబుతున్నాయి. అది ఇక్కడి నుంచి కదలదు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవు. అమరావతి మాత్రమే ఉంటుంది. మీరేం భయపడక్కర్లేదు….అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదేపదే జనానికి చెబుతున్నారు. కన్నా నిన్న ఢిల్లీలో ఇదే మాట చెప్పాడు. ఈరోజు అమరావతిలో ఉద్యమకారులతో భేటీ అయిన పవన్‌ కళ్యాణ్‌ ఇదే మాట చెప్పాడు. పవన్‌ ఆవేశంతో ఊగిపోయాడు. రాజధాని అమరావతిలోనే ఉంచేదాకా జనసేన నిద్రపోదన్నాడు.

‘బీజేపీతో కలిసింది కేవలం అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచడం కోసమే’ అని పవన్‌ చెప్పాడు. ఇంతకుమునుపు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పనిచేస్తామన్నాడు. ఇప్పుడేమో కేవలం అమరావతి కోసమే కలిశామంటున్నాడు. రేపు ఢిల్లీ వెళుతున్నానని, అక్కడ బీజేపీ నాయకులతో మాట్లాడతానని చెప్పాడు. అమరావతే రాజధానిగా ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పవన్‌ పదేపదే చెప్పాడు. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకులు ఇలా ఆవేశంగా, గట్టిగా, ప్రజలను నమ్మించేలా మాట్లాడటం చూస్తూనే ఉంటాం.

కన్నా లక్ష్మీనారాయణగాని, పవన్‌ కళ్యాణ్‌గాని మూడు రాజధానులను నిలువరించడానికి సొంతంగా చేసేదేమీ లేదు. రోడ్లపైకి వచ్చి ఎంత పోరాటం చేసినా ప్రయోజనం ఉండకవపోచ్చు. కన్నా, పవన్‌ ఇద్దరూ కేంద్రం ఏదో చేస్తుందనే ఆశతో ఉన్నారు. అంటే కేంద్రం జోక్యం చేసుకొని మూడు రాజధానులను అడ్డుకుంటుందని నమ్ముతున్నారు. మూడు రాజధానులను అడ్డుకోవడానికి ఏదైనా ప్లాన్‌ ఉంటే అది కేంద్రం దగ్గరే ఉంటుంది. అదేమిటో ఇప్పటివరకు చూచాయగా కూడా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. చట్టసభల్లో మూడు రాజధానులు బిల్లు పాస్‌ చేయించుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్లాన్‌ బయటపెట్టకూడదని ఢిల్లీ బీజేపీ పెద్దలు అనుకుంటున్నారా? అసెంబ్లీలో బిల్లు పాసైంది.

మండలిలో సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. మండలిలో బిల్లు ఆమోదం పొందకపోతే మండలినే రద్దు చేస్తారని, ఆర్డినెన్స్‌ తెస్తారని సమాచారం వస్తోంది. బిల్లు మండలిలో ప్రవేశపెట్టకముందు బీజేపీ నాయకులంతా ఒకటే మాట చెప్పారు. ఏమని? కేంద్రం చూస్తూ ఊరుకోదని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఇదే అన్నాడు.

అసెంబ్లీలో బిల్లు పాసైంది కాబట్టి సరైన సమయం వచ్చిందని బీజేపీ, జనసేన నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాతనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని మొన్నటివరకు చెప్పారు. మరి నిర్ణయం అధికారికంగా ప్రకటించింది కాబట్టి లెక్క ప్రకారం జోక్యం చేసుకోవాలి. బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కొన్ని రోజుల కిందట రాజధాని విషయంలో కేంద్రం జోక్యం కల్పించుకోదని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని అన్నాడు. కాని జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నాక కేంద్రం చూస్తూ ఉరుకోదన్నాడు.

ఈరోజు ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్‌ ‘కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన ఏపీలో జగన్‌ ప్రభుత్వాన్ని బీజేపీ చేయగలిగింది ఏమీ లేదు’ అన్నాడు. జగన్‌ ప్రభుత్వాన్ని కూలదోసిపారేస్తే సరిపోతుందిగదా అని కొందరు బీజేపీ కార్యకర్తలు అంటున్నారని, కాని కేంద్రం ఆ పని చేయబోదని జీవీఎల్‌ అన్నాడు. ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎవ్వరూ అనుకోవడంలేదు. కేంద్రానికి అది సాధ్యం కూడా కాదు. కాని మూడు రాజధానులు ఆపడానికి ఏదైనా ప్లాన్‌ ఉందా? అన్నదే కీలక ప్రశ్న.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

ప్రజల కామన్‌సెన్స్‌కు పరీక్ష పెడుతున్న జగన్ !

వివేకా హత్య కేసు దగ్గర నుంచి తన పరిపాలనా ఘనతల వరకూ ... ప్రతీ అంశంలోనూ సీఎం జగన్ చెబుతున్న విషయాలు.. చెప్పుకున్నంటున్న అంశాలు.. క్రెడిట్ తీసుకుంటున్న వ్యవహారాలు చూస్తే.. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close