పవన్‌కళ్యాణ్‌ మరో తప్పు చేస్తున్నాడా?

పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో పెద్ద కమర్షియల్‌ హిట్‌గా ‘ఖుషి’ చిత్రం నిలుస్తుంది. ఆ చిత్రానికి పవన్‌కి వచ్చిన మంచి పేరు వల్ల ఆ తర్వాత అతను ఎన్ని ఫ్లాప్‌ సినిమాలు చేసినా తప్పకుండా పెద్ద హిట్‌ ఇస్తాడని అభిమానులు ఓపికగా ఎదురుచూశారు. ‘ఖుషి’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన ఎస్‌.జె.సూర్యతో ‘కొమరం పులి’ చేస్తున్నాడని తెలిసి తమ అభిమాన హీరోకి మరో బిగ్గెస్ట్‌ హిట్‌ రాబోతోందని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌ అయి అభిమానుల్ని నిరాశ పరిచింది. ఆ తర్వాత ‘గబ్బర్‌సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ని తన ఖాతాలో వేసుకున్న పవన్‌ ఇప్పుడు ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఈ సినిమా ‘గబ్బర్‌సింగ్‌’ని మించిన హిట్‌ అవుతుందని అభిమానులు హోప్స్‌ పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత పవన్‌ చెయ్యబోయే సినిమా గురించి తెలిసి మరోసారి తప్పు చెయ్యబోతున్నాడా అనే అనుమానం అందరికీ వస్తుంది. ఎస్‌.జె.సూర్యతో పవన్‌ సినిమా చెయ్యబోతున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కొమరం పులి’ పెద్ద డిజాస్టర్‌ కావడంతో మళ్ళీ ఈ కాంబినేషన్‌లో సినిమా చెయ్యడానికి ఏ నిర్మాతా ముందుకు రావడం లేదట. అయినా వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా ఎస్‌.జె.సూర్యతో తను చెయ్యబోయే సినిమాని తన సొంత బేనర్‌లోనే తియ్యడానికి డిసైడ్‌ అయ్యాడు పవన్‌. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మళ్ళీ తమ హీరో తప్పు చేస్తున్నాడని ఆవేదన చెందుతున్నారట. మరి ఈ విషయం గురించి పవన్‌ పునరాలోచించుకుంటాడా? లేక సూర్యతో సినిమా చెయ్యడానికే ఫిక్స్‌ అవుతాడా? అనేది తెలియాల్సి వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close