పాతికేళ్లు కాదు పవన్‌ది కూడా పాతిక కేజీల మ్యానిఫెస్టోనే..!

రైతులకు ఎకరానికి రూ. ఎనిమిది వేల పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, విద్యార్థులకు ఉచిత రవాణా, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు, ముస్లింలకు సచార్ కమిటీ సిఫార్సుల అమలు, మత్స్యకారులకు 300 రోజులు ఉపాధి, మత్స్యకారులకు మరపడవలు, ప్రతి రైతుకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా, 60 ఏళ్లు దాటిన చిన్నకారు రైతులకు రూ.5వేలు పెన్షన్‌, అన్ని కులాలకు కలిపి కామన్ హాస్టల్స్, పావలా వడ్డీకే చిరు వ్యాపారులకు రూ. 5వేల రుణం, బంగారం మీద అర్థరూపాయి వడ్డీకే రుణం, డ్వాక్రా మహిళల కోసం బ్యాంక్, ఒక్కో జిల్లాకు పది చొప్పున 13 జిల్లాలకు 130 స్మార్ట్ సిటీస్, రెల్లి యువతకు రూ. 50 వేల వరకూ వడ్డీ లేని రుణం, పారిశ్రామికీకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిశ్రమల్లో భాగస్వామ్యం… ఇలాంటి హామీలన్నింటితో మేనిఫెస్టోను.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజమండ్రిలో జరిగిన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించారు.

తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో పవన్ రాజమండ్రి ఆవిర్భావ సభలో వివరించారు. అన్యాయంపై గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇంటర్‌లో చదువు ఆపేసినా… చదవడం ఆపలేదని.. ప్రకటించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని.. కానిస్టేబుల్‌ ఇంట్లో పుట్టిన ఓ వ్యక్తి 2019లో సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు. గెలుపోటములు తెలియదు… యుద్ధం చేయడమే తెలుసని ప్రకటించారు. అలాగే సీఎం పదవిపై కోరిక లేదు, అందలం ఎక్కాలని ఆశ లేదు.. పవర్‌స్టార్‌ పదంపైనే ఆసక్తి లేదు, సీఎం పదవిపై ఉంటుందా? అని వెంటనే రెండో ఒపీనియన్ వినిపించారు. డబ్బుంటే చాలు గెలవొచ్చనే పరిస్థితుల్లో ఉన్నామని.. డబ్బు, పేరు నాకు ఎప్పుడూ ఆనందం ఇవ్వలేదన్నారు. మనిషికి అన్యాయం జరుగుతుంటే వర్గీకరించి చూడలేనన్నారు. జనసేనను స్థాపించినప్పుడు నేనెక్కడినే… ఇప్పుడు సైన్యం ఉందని ధైర్యం వ్య్కతం చేశారు. తెలుగు ప్రజల సుస్థిరత కోసమే గతంలో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని.. అడుగేస్తే తలతెగాలి కానీ… వెనుకడుగు వేయనన్నారు. రాజకీయంగా పవన్ కల్యాణ్ ఎక్కువగా జగన్ పై గురి పెట్టారు. కేసీఆర్ జోక్యంపై నేరుగా విమర్శలు గుప్పించారు. జగన్మోహన్‌రెడ్డికి ఒకటే చెబుతున్నా..! దమ్ముంటే.. రండి.. మీరు, మేము, చంద్రబాబు కలిసి తేల్చుకుందాం..! అంతే కానీ కేసీఆర్‌ను ఎందుకు తెస్తారు రాష్ట్రానికి..! అని మండిపడ్డారు.

నాలుగేళ్లుగా ఎంత తిట్టినా, బెదిరించినా వెనక్కి తగ్గలేదన్నారు. రూ.వేల కోట్లు ఉంటేనే రాజకీయాల్లో రాణించగలరు.. టీనేజీ యువతే నీ దగ్గర ఉంది… ఎలా గెలుస్తావని కొంత మంది ఎగతాళి చేసినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో శత్రులెవరూ లేరన్నారు. జగన్‌ విధానాలను ప్రశ్నిస్తే… తనపై వ్యక్తిగత దాడి చేస్తున్నారని… ఏం తప్పుచేశాను? మీలాగా రూ.వేల కోట్లు దోచానా? అని పవన్ ప్రశ్నించారు. కుటుంబ పాలన చేశానా? నా కష్టాలు మీకేం తెలుసు అని పవన్‌ ఆవేశంగా ప్రశ్నించారు. తనను పల్లకీలు మోసేందుకు ఉపయోగించుకున్నారని… ప్రజలను పల్లకీలో మోస్తారనే… మీ పల్లకీలు మోశానని పవన్ టీడీపీ నేతలను హెచ్చరించారు. జనసేన బలం కేవలం గోదావరి జిల్లాలే కాదు… సమస్త ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జనసేన బలమన్నారు. తెలంగాణలో పోటీ చేయలేదు కానీ… మున్ముందు చేస్తామన్నారు. తెలంగాణకు జనసేన అవసరం ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close