స‌ప్త‌గిరి రుణం తీర్చుకొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

స‌ప్త‌గిరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫంక్ష‌న్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ గెస్ట్ అన‌గానే అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ‘ప‌వ‌న్‌ని భ‌లే ప‌ట్టేశాడ్రా స‌ప్త‌గిరి…’ అంటూ… స‌ప్త‌గిరి తెలివితేట‌ల‌కు మురిసిపోయారు. అయితే ఇక్క‌డ ఆ తెలివితేట‌లు స‌ప్త‌గిరివి కావు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌వే. ఎందుకంటే స‌ప్త‌గిరికి ప‌వ‌న్ చేసిన సాయం కంటే, ప‌వ‌న్‌కి స‌ప్త‌గిరి చేసిన సాయ‌మే ఎక్కువ‌. అదెలాగంటే.. ప‌వ‌న్ లేటెస్టు సినిమా టైటిల్ ‘కాట‌మ‌రాయుడు’ స‌ప్త‌గిరి సినిమాని పెట్టాల‌నుకొన్న పేరు. ప‌వ‌న్ ఆ టైటిల్‌పై మోజు ప‌డి.. టైటిల్ కావాల‌నుకొన్నాడు. స‌ప్త‌గిరి అభిమానంతో ఇచ్చేసి… త‌న సినిమాకి ‘స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌’ అనే మ‌రో పేరు పెట్టుకొన్నాడు. ఆ రుణం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా తీర్చుకొన్నాడ‌న్న‌మాట‌.

అయితే ప‌వ‌న్ రాక‌తో.. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌కి మాంఛి జోష్ వ‌చ్చింది. ప‌వ‌న్ రావ‌డ‌మే కాదు.. స‌ప్త‌గిరిని మ‌న‌స్ఫూర్తిగా ఆశీర్వ‌దించాడు కూడా. గ‌బ్బ‌ర్ సింగ్‌లో స‌ప్త‌గిరి చిన్న వేషం వేశాడు.. అది చూసి ఆయ‌న్ని క‌ల‌వాల‌నుకొన్నా. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఇలా ఆ అవ‌కాశం వ‌చ్చింది అంటూ… స‌ప్త‌గిరిపై త‌న‌కున్న ‘అభిమానం’ చాటుకొన్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అంతేకాదు.. కాట‌మ‌రాయుడు టైటిల్‌ని అడిగిన వెంట‌నే ఇచ్చేసిన స‌ప్త‌గిరి ఔదార్యాన్ని గుర్తు చేశాడు కూడా. ‘టైటిల్ అడిగినందుకు నాకే సిగ్గుగా అనిపించింది. అయినా.. అడిగిన వెంట‌నే ఇచ్చినందుకు స‌ప్త‌గిరికి కృత‌జ్ఞ‌త‌లు’ అని త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు ప‌వ‌న్‌. అంతేకాదు. తాను ఎక్కువ సినిమాలు చూడ‌న‌ని, అయితే స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ సినిమా మాత్రం చూడాల‌ని వుంద‌ని, సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌త్యేకంగా షో వేసుకొని చూస్తాన‌ని చెప్పుకొచ్చాడు ప‌వ‌న్‌. సో.. కాట‌మ‌రాయుడు టైటిల్ ఇచ్చినందుకు గిట్టుబాటు అయ్యే రేంజులోనే ప‌వ‌న్ స్పీచ్ సాగింది. ప‌వ‌న్ ఖుషీ… ప‌వ‌న్ రాక‌తో స‌ప్త‌గిరి ఇంకా ఖుషీ. అలా సాగింది.. స‌ప్త‌గిరి ఆడియో ఫంక్ష‌న్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close