ప‌వ‌న్ వ‌స్తే… లెక్క‌ల‌న్నీ మారాల్సిందే

ఎట్ట‌కేల‌కు `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. దాంతో ఈ రీమేక్ పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. బాల‌కృష్ణ – ర‌వితేజ‌, రానా – ర‌వితేజ‌… ఇలా చాలా కాంబినేష‌న్ల‌ని మార్చీ.. మార్చీ.. చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ – రానాకి ఫిక్స‌య్యారు. రానా పేరు అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా 99 శాతం ఆయ‌న ఖాయ‌మైన‌ట్టే.

ప‌వ‌న్ రాక‌తో.. ఈ రీమేక్ లెక్క‌ల‌న్నీ మారిపోబోతున్నాయి. `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌`లో బీజూ మీన‌న్ పోషించిన పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపించ‌నున్నాడు. అక్క‌డ బీజూకు ఉన్న ఇమేజ్ వేరు, ఇక్క‌డ ప‌వ‌న్‌కి ఉన్న ఇమేజ్ వేరు. ఆ పాత్ర రూపు రేఖ‌ల్ని పూర్తిగా మార్చాల్సిందే. ఈ సినిమాలో ప‌వ‌న్ ని ఓ సూప‌ర్ కాప్ గా చూపిస్తున్నామ‌ని చిత్ర‌బృందం ముందే హింట్ ఇచ్చేసింది. `అయ్య‌ప్ప‌యుమ్‌..`లో బీజూది సూప‌ర్ కాప్ పాత్ర‌యితే కాదు. దాన్ని బ‌ట్టి… ప‌వ‌న్ కోసం ఈ పాత్ర‌ని ఎంత మారుస్తున్నారో అర్థం చేసుకోవొచ్చు. సాగ‌ర్ చంద్ర ఈ సినిమా స్క్రిప్టుని ఎప్పుడో సిద్ధం చేసేశాడు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ `చేయి` చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఎందుకంటే… అటు ప‌వ‌న్, ఇటు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్.. రెండింటికీ త్రివిక్ర‌మ్ ఆప్తుడే. త్రివిక్ర‌మ్ ప్రోగ్భ‌లం వ‌ల్లే… ప‌వ‌న్ ఈ రీమేక్ ఒప్పుకున్న‌డ‌న్న టాక్ న‌డుస్తోంది. అలా చూసినా త్రివిక్ర‌మ్ హ్యాండు ఈ సినిమాలో ఉంటున్న‌ది సుస్ప‌ష్టం. `వ‌కీల్ సాబ్` అవ్వ‌గానే ఈ రీమేక్‌ని మొద‌లెట్టాల‌ని ప‌వ‌న్ చూస్తున్నాడు. రెండంటే రెండు నెల‌ల్లో ఈ రీమేక్‌ని పూర్తి చేయాల‌ని చెప్పాడ‌ట‌. అంటే.. రానా డేట్లు, షెడ్యూళ్లూ అన్నీ స‌ర్దుబాటు చేయాల్సిందే. ప‌వ‌న్ కాక‌పోతే.. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఈ సినిమాని మెల్ల‌గా మెట్లెక్కించేది. ప‌వ‌న్ కోసం… మిగిలిన సినిమాల్నీ ప‌క్క‌న పెట్టి, దీన్ని ముందుకు తీసుకురావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ప్పుడు. చూద్దాం.. రాను రాను.. ఇంకెన్ని మార్పులు వ‌స్తాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

`వైల్డ్ డాగ్`… ప్లాన్ బి ఉందా?

నాగార్జున న‌టించిన సినిమా `వైల్డ్ డాగ్‌`. పూర్తి స్థాయి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈసినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని...

“ఉద్రిక్తతలు” లేకుండా కేసీఆర్ ప్రచారసభ..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారసభలో వ్యూహాత్మక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఆయన తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతారని అందరూ అనుకున్నారు....

ప్రకాష్‌రాజ్‌ సద్విమర్శనూ పాజిటివ్‌గా తీసుకోలేరా..!?

పవన్ కల్యాణ్ రాజకీయ గమనాన్ని..నిర్ణయాల్ని విమర్శించిన ప్రకాష్‌రాజ్‌పై.. పవన్ కల్యాణ్ క్యాంప్ భగ్గుమంది. జనసైనికులు ఎన్నెన్ని మాటలు ‌అన్నా.. జనసేనాని సోదరుడు నాగబాబు చేసిన విమర్శలు మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సినవే. కానీ ప్రకాష్‌రాజ్‌ను...

నవరత్నాలు ఆపేయమని జగన్‌కు ఉండవల్లి సలహా..!

జగన్ శ్రేయోభిలాషిగా అందరికీ గుర్తుండే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలి కాలంలో ప్రెస్‌మీట్లు పెట్టి.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఆయన చేస్తున్న తప్పులను కరెక్ట్ చేసి.. ఆయనకు మేలు చేద్దామన్న...

HOT NEWS

[X] Close
[X] Close