జనసేన: మార్పు రావడానికి సమయం పడుతుంది.. కానీ ఆ మార్పుతో చరిత్ర సృష్టించడం మాత్రం ఖాయం…

వెండితెర మీద ఆయనొక తిరుగులేని రారాజు.. పట్టుమని పది హిట్టు సినిమాలు లేని ఒక అసాధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సామాన్యుడు….

ఆయన వ్యక్తిత్వం, విలువలు, సమాజానికి ఎదో చెప్పాలని, చేయాలనే ఆయన ఆలోచన ఆయనికి అభిమానులతో పాటు దేవుడిగా కొలిచే భక్తులని కూడా తెచ్చిపెట్టాయి.

డిగ్రీలు, పీజి లు చదవలేదు. అయినా ఆలోచన విధానంలో ఒక గొప్ప శాస్త్రవేత్త తో సమానం. అపరమేధావి… ఎవరైనా ఆపదలో ఉంటే తన స్థాయికి మించి సహాయం చేసే సహృదయుడు.

అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ లో యువరాజ్యం అధ్యక్షుడిగా చేసినా కూడా ఒక MLA స్థానాన్నో, MP స్థానాన్నో ఆశించలేదు.. అధికారానికో, పదవికో ఆశపడి ఉంటే 2009 లోనే సాధించుకునేవాడు. తన స్థాయిని తెలుసుకొని ఒక సామాన్య కార్యకర్తలా మాత్రమే పని చేసాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు, స్వతహాగా పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకున్నాడే గాని, తప్పు చేసింది అన్నయ్యే కదా అని సమర్ధించలేదు. అది ఆయన నిబద్దత కి నిదర్శనం.

2009 లో జనసేన ను స్థాపించినప్పుడు మళ్ళీ ప్రజారాజ్యం-2 అని చాలామంది వెక్కిరించినా కూడా తాను నమ్ముకున్న ఆశయసాధన కోసం ఎక్కడ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. 2009 ఎన్నికలలో తన బలమెంతో తెలుసు కాబట్టే అధికారం అవినీతిపరుల చేతికి వెళ్లకూడదని, అప్పుడే పుట్టిన రాష్ట్రానికి ఒక అనుభవం గల నాయకత్వం అవసరమని భావించి తెలుగుదేశం పార్టీ కి మద్దతు పలికి ఎన్నికలలో పోటీ చేయలేదు. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పార్టీలు కూడా సీట్ల సర్దుబాటు లేనిదే పొత్తుకు ఒప్పుకోవు. అలాంటిది తన మద్దతుతో ఒక రాష్ట్రానికి అధికారాన్ని నిర్ణయించే శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పటికీ, తను ఒక్క పదవిని కూడా ఆశించలేదు. తను కోరితే కనీసం 10 MLA సీట్లు, 2 MP సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉన్నాకూడా ఏ పదవినీ కోరుకోలేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోమని, అవినీతి లేని పాలన అందించమని, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేయమని మాత్రమే కోరుకున్నాడు. అది ఆయనకి అధికారం మీద వ్యామోహం లేదని చెప్పడానికి నిదర్శనం.

ప్రతిపక్షం తన MLA లని కాపాడుకోలేక, ప్రభుత్వం చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించలేక, ప్రజా సమస్యల మీద చర్చించలేక సభ నుంచి పారిపోయిన వేళ… ఆ బాధ్యతని జనసేన తీసుకుంది. సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేసింది.

  • ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య
  • చేనేత కార్మికుల సమస్యలు
  • రాజధాని రైతుల సమస్యలు
  • హోమ్ గార్డ్ ల సమస్యలు
  • డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటైజషన్
  • GO – 64 : NG Ranga Agriculture యూనివర్సిటీ
  • ఫాతిమా మెడికల్ కాలేజి విద్యార్థులు
  • అనకాపల్లి – షుగర్ ఫ్యాక్టరీ
  • రెల్లి కులస్తుల బాధలు
  • అగ్రి గోల్డ్ బాధితులు
  • చింతమనేని ప్రభాకర్ అధికార దుర్వినియోగం
  • వంతాడ – illegal Mining
  • కాకినాడ సముద్ర తీరం లో “హోప్ ఐస్ ల్యాండ్” అక్రమ తవ్వకాలు
  • రెయిన్ గన్స్ స్కాం
  • మెగా ఆక్వా ఫుడ్ పార్క్- పొల్యూషన్

ఇలా చెప్పుకుంటూ పొతే బహుశా ప్రతిపక్షం కూడా సిగ్గుతో తలవంచుకోవాలి తమ బాధ్యతని కూడా జనసేన నిర్వర్తిస్తోంది అని…….

ప్రత్యేకహోదా ని ప్రభుత్వం అవహేళన చేసి, కేంద్రానికి తలవంచినప్పుడు మీరు చేసేది తప్పు అని ప్రశ్నించి ప్రజాక్షేత్రం లో వారిని దోషులుగా నిలబెట్టిన పార్టీ జనసేన.

తమ తప్పులను ప్రశ్నించినందుకు తమ గెలుపుకి కారణం అయిన జనసేనని నిర్వీర్యం చేయాలనీ శతవిధాలా ప్రయత్నించి ఇప్పుడు మళ్ళీ అదే జనసేన కౌగిలి కోసం ఎదురుచూస్తున్నది తెలుగుదేశం.

TRPs కోసం ఎంత వరకైనా దిగజారడానికి సిద్దమైన మన తెలుగు మీడియా. ఒక పార్టీ కోసం పనిచేసే ఎల్లో మీడియా. పవన్ కళ్యాణ్ ని తిడితే పేరొస్తుందని భావించే ఒక నీచపు ఆలోచన ఉన్న కొందరు వ్యక్తుల చేత నెలల తరబడి డిబేట్లు పెట్టి, ఆఖరికి తల్లి ని కూడా బూతులు తిట్టించే కార్యక్రం చేసి.. దాని మీద కూడా చర్చాకార్యక్రమాలు చేపట్టిన మెరుగైన సమాజం కోసం పని చేసే మన దమ్మున్న చానెల్స్. ఇలాంటి ఒక విపత్కర పరిస్థితిని తనడైన శైలిలో ఎదుర్కొన్నాడు పవన్ కళ్యాణ్. ఆయా చానెల్స్ అధినేతలకు, రాజకీయ నాయకులకు మూడు రోజులు ముచ్చెమటలు పట్టించాడు . బహుశా మీడియా కి చుక్కలు చూపించిన చరిత్రలో పవన్ కళ్యాణ్ మాత్రమే ఉంటారేమో.

అప్పటినుండి తెలుగు రాష్ట్రాల్లో అగ్ర స్తానం లో ఉండే చానెల్స్ అన్ని కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ వార్తలని గాని, జనసేన వార్తలని గాని ప్రజలకి చేరకుండా తమవంతు ప్రయత్నం చేసాయి. నిజంగా చెప్పాలంటే జనసేన కేవలం సోషల్ మీడియాని నమ్ముకొని మాత్రమే ఇంత దూరం రాగలిగింది. డబ్బుకు అమ్ముడు పోయే మీడియా ఒక మంచి పనిని చూపించడానికి కూడా మనసు మార్చుకోలేక పోయింది.

జనసేన లో సరైన నాయకులు లేరు అంటారు. చేరడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు అంటారు. అందుకే జనసేన కి పోటీ చేసే బలం, ధైర్యం లేదు అంటారు. కానీ అందరు నిజాన్ని మాత్రం దాచిపెడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంత తేలికగా ఎవరినీ పార్టీ లోకి రానివ్వట్లేదు పవన్ కళ్యాణ్. చాలామంది పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసారు, చేస్తున్నారు కూడా.. కానీ ఒక నవ నాయకత్వాన్ని, మార్పుని తీసుకువచ్చే నాయకత్వాన్ని కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే నాయకుల ఎంపికలో ఎక్కడ కూడా రాజీ పడట్లేదు.

2019 లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం. విలువలతో కూడిన రాజకీయం కోసం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలను జనసేన దూరంగా ఉంచుతుందని నమ్ముతున్నాం. ఒక మార్పుకి శ్రీకారం చుడుతుందని ఆశిస్తున్నాం.

మార్పు కి మేము సిద్ధంగా ఉన్నాము. అది 2019 లో కావొచ్చు, 2029 లో కావొచ్చు లేదా ఒక తరం పట్టొచ్చు. అందుకు నేను వేచి చూస్తాను.

— హరీష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close