ప‌వ‌న్ తొలి ప్రేమ భ‌లే ఉందే…!

ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలి ప్రేమ క‌బుర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వ‌ప‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈరోజు ఓ ప్ర‌ధాన పత్రిక‌.. ప‌వ‌న్ ల‌వ్ స్టోరీని బ‌య‌ట‌కు తీసింది. ప‌వ‌న్ మ‌ద్రాస్‌లో ఉన్న‌ప్పుడు కంప్యూట‌ర్ నేర్చుకునేవాడు. ఆ బ్యాచ్‌లోనే ఓ అంద‌మైన అమ్మాయి ఉండేద‌ట‌. ప‌వ‌న్‌తో చాలా చ‌నువుగా మాట్లాడేద‌ట‌. ప‌వ‌న్ స్నేహితులు `ఇది ల‌వ్వే` అనేస‌రికి.. నిజంగా అది ప్రేమే అనుకుని… ఆ అమ్మాయికి ఐ ల‌వ్ యూ చెప్పాల‌ని డిసైడ్ అయిపోయాడ‌ట‌. ఓరోజు… ఇంట్లో ఎవ‌రూ వాడ‌కుండా ప‌క్క‌న ప‌డేసిన ఓ డొక్కుకారుని బ‌య‌ట‌కు తీసి, బాగు చేసి, శుభ్రం చేసి… ఆ కారులో అమ్మాయి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడ‌ట‌. ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని కొంత‌దూరం వెళ్లి.. కారు ప‌క్క‌కు ఆపి.. `నేను నిన్ను ప్రేమిస్తున్నా` అనే విష‌యాన్ని చెప్పేశాడ‌ట‌. దాంతో ఆ అమ్మాయి ఓ భ‌యంక‌ర‌మైన క్లాసుకుంద‌ట‌. `ప్రేమంటే ఏమిటి? ఈ వ‌య‌సులో ఉన్న‌దంతా ఆక‌ర్ష‌ణే` అంటూ క్లాసు పీకేస‌రికి ప‌వ‌న్‌కి జ్ఞానోద‌య‌మైంద‌ట‌. `ఆ అమ్మాయి అప్పుడు క్లాస్ టీచ‌ర్‌లా క‌నిపించిందంటూ.. త‌న ల‌వ్ స్టోరీని ఓ సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ల్యాణే స్వ‌యంగా చెప్పాడ‌ట‌. మొత్తానికి హీరో కాక‌ముందు జ‌రిగిన ప‌వ‌న్ ల‌వ్ స్టోరీ భ‌లే గుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్క‌డుందో, ఏం చేస్తుందో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com