కరెంట్ పోయినా.. గేదెలొచ్చినా .. మట్టికుప్పలు ఉన్నా పవన్ కోసం వేసిన స్కెచ్చేనా..?

“ఏమీ చేయకపోయినా ఎందుకురా అంతలా అరుస్తున్నావ్.. అంటే.. తర్వాత అరవలేనేమోనని..” సమాధానం చెబుతాడు త్రివిక్రమ్ సినిమాలోని ఓ క్యారెక్టర్. జనేసన అధినేత పవన్ కల్యాణ్.. చేసే వ్యాఖ్యలు… ఆరోపమలు చూస్తూంటే.. ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. నిజం కాదని తెలుస్తూనే ఉంటుంది.. కానీ.. తనపై.. ఏదో కుట్ర జరిగిపోతోందని… చెబుతూ ఉంటారు. చివరికి కరెంట్ పోయినా… తన పై వేసిన స్కెచ్చేనని చెబుతూంటారు. ఉత్తరాంధ్రలో.. పోరాటయాత్ర ప్రారంభించినప్పుడు… ఓ కల్యాణ మండపంలో ఆయన బస చేసినప్పుడు… కరెంట్ పోయింది. నిజానికి కరెంట్ పోలేదు. కలవడానికి వచ్చిన విద్యుత్ కాంట్రాక్ట్ సిబ్బందిని పవన్ కలవడానికి నిరాకరించడంతో వాళ్లు కరెంట్ తీసేశారు. ధర్నా చేశారు. తర్వాత పోలీసులు వచ్చి… వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత పవన్ పలాసలో పోరటయాత్రకు కవాతు చేస్తున్నప్పుడు అటు వైపు గా కొన్ని గేదెలు వచ్చాయి. అవి రోజూ.. తమ షెడ్యూల్ ప్రకారం పొలాల్లో మేసి.. అవి వాటి గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. ఆ సమయంలో వాటికి ఎదురు జనసేన కవాతు జరిగింది. అవి బెదిరిపోయి.. అటూ ఇటు పరుగులు పెట్టాయి. ఈ రెండు సంఘటలను పవన్ కల్యాణ్… ప్రభుత్వం చేసిందని ఆరోపించేశారు. తనపై పెద్ద స్కెచ్ వేశారని.. తాను ఎన్నటికీ భయపడబోనని చెప్పుకొచ్చారు. జనసైనికులు ఈలలు వేశారు కానీ… సోషల్ మీడియాలో మాత్రం సెటైర్లు పడ్డాయి.

అలాంటి ఆరోపణలు తరచూ చేస్తూనే ఉన్నారు. ఆకు రౌడీ అంటూ చింతమనేని ప్రభాకర్ పై.. చేసిన సవాళ్ల తర్వతా అలాంటి ఆరోపణలు చేశారు. తనకే భద్రత లేని రాష్ట్రంలో అసలు శాంతి భధ్రతలు ఎక్కడున్నాయని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ క్రమంలో తనను చంపడానికి ముగ్గురు వ్యక్తులు స్కెచ్చేశారని.. ఆ ఆడియో టేపులు ఉన్నాయని… వాళ్లెవరో కూడా తెలుసని ప్రకటించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ టేపులు ఇవ్వాలని.. పోలీసులు అడిగితే స్పందించలేదు. దాంతో అవి రాజకీయ ఆరోపణల్లా మారిపోయాయి. తాజాగా… నిన్నటికి నిన్న తూర్పుగోదావరి జిల్లాలో వంతాడ అనే గ్రామం మీదగా వెళ్తూంటే.. రోడ్డుపై మట్టి కుప్పలు కనిపించాయట. తాను అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని కాబట్టి చేయని మైనింగ్ మాఫియా నేను వస్తుంటే అడ్డంగా మట్టికుప్పలు వేసిందని మండిపడ్డారు. మైనింగ్ చేసేవాళ్లు తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండాలని హితవు చెప్పారు.

పవన్ కల్యాణ్ తనను తాను గొప్పగా ఊహించుకోవచ్చు. తాను చాలా మందికి.. టార్గెట్‌ గా ఉన్నానని ఆందోళన చెందవచ్చు. ఇంకా చెప్పాలంటే… దానికి తగ్గట్లుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది కానీ.. ప్రతీ దానికి… తనను అడ్డుకోవడం కోసమే.. రోడ్డు మీద మట్టి కుప్పలేశారని.. కరెంట్ తీశారని.. గేదెల్ని వదిలారని చెప్పుకోవడం.. కాస్తంత ఫన్నీగా ఉంటుంది. జనసేన అధినేత చేసే ఆరోపణల్లో సీరియస్ నెస్ లేకుండా పోతుంది. అలాంటి డైలాగులు చెప్పినప్పుడు .. జనసైనికులు చప్పట్లు కొడతారు. అదే కాదు.. పవన్ కల్యాణ్… ఏం చెప్పినా చప్పట్లు కొడతారు. చివరికి పవన్ ” నేను ఓడిపోతాను..” అన్నా చప్పట్లు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తన స్పీచ్‌పై టాక్ అది కాదు.. ప్రజలు ఏమనుకుంటున్నారో.. అనేదే టాక్. పవన్ కల్యాణ్ దాని గురించి తెలుసుకుని.. స్పీచ్‌లు రెడీ చేసుకుంటే బాగుంటుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close