సిక్కోలులో చేరికల రాజకీయం..! పవన్‌కి టైమింగ్ తెలియదా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనను విమర్శిస్తే తట్టుకోలేకపోతున్నారు. అదే పనిగా… ట్వీట్ కౌంటర్లు ఇస్తున్నారు. విమర్శిస్తే.. గుర్తు పెట్టుకుని మరీ.. సంగతి తేలుస్తా అన్నట్లు ట్వీట్లు పెడుతున్నారు. కానీ.. అసలు విమర్శించే అవకాశాల్ని పరిస్తితుల్ని కూడా.. పవన్ కల్యాణ్ కల్పిస్తున్నారు. ఉద్దానంకు తానున్నానని గతంలో ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకున్న ఆయన.. అక్కడ టిట్లి తుపాను దెబ్బకు విలయం ఏర్పడితే.. తీరిగ్గా వారం తర్వాత వచ్చారు. సహజంగా తెలుగుదేశం పార్టీ నేతలకు… విమర్శలు గుప్పించడానికి ఇంత కన్నా.. గొప్ప అవకాశం ఉండదు. వారి పని వారు చేశారు. ఈ యాంగిల్‌లో అయితే.. ఒక్క రోజు విమర్శలు చేసి ఊరుకునేవారు. కానీ… పవన్ కల్యాణ్.. బాధితుల పర్యటనలో రాజకీయాలు మిక్స్ చేశారు.

మామూలుగా ప్రభుత్వాన్ని విమర్శించి… సరిగ్గా సహాయ కార్యక్రమాలు చేయలేదని చెప్పడం వేరు… పవన్ చేసింది ఆ తరహా రాజకీయం కాదు. పార్టీలో చేరిక కార్యక్రమాలు చేసి.. ఉల్లాసంగా, ఉత్సాహంగా… గడుపడమే… కొత్త విమర్శలకు కారణం అవుతోంది. రోజులో నాలుగైదు గంటలు… గ్రామాల్లో పరిశీలనకు వెళ్లి మిగతా సమయం పార్టీ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. మొదటి రోజు… సిక్కోలు జిల్లాలో పరిస్థితి చూసి తన కడుపు తరుక్కుపోయిందని.. కన్నీళ్లొచ్చాయని.. కానీ ఏడువడం బాగుందడని.. ఏడవలేదని.. చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాతి రోజు .. దసరా సందర్భంగా విల్లంబులు చేబట్టి.. ఉల్లాసంగా .. ఉత్సాహంగా… తిరుపతి మాజీ ఎమ్మెల్యే , టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలో చేర్చుకున్నారు. ఓ గొప్ప సీనియర్‌ని పార్టీలో చేర్చుకున్నట్లు విజయగర్వంతో.. ట్వీట్ చేశారు.

ఆ తర్వాతి రోజు అంటే నిన్న కూడా పార్టీలో చోటా నేతల్ని చేర్చుకుని.. విజయగర్వంతో ప్రెస్ మీట్ పెట్టారు. అందులో అడపాదడపా… సిక్కోలు వేదన గురించి చెప్పినా.. అది ప్రభుత్వంపై విమర్శలు చేసి.. రాజకీయం చేసినట్లు ఉంది కానీ… ప్రజలకు ఉపయోగపడేలా లేదు. అయినా.. పార్టీలో చేరిక కార్యక్రమాలు… సిక్కోలు విలయాన్ని పరిశీలించడానికి బాధితుల ఓదార్పు ఇవ్వడానికి వచ్చినప్పుడు పెట్టుకోవాల్సిన కార్యక్రమాలు కాదనుకుంటా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close