ఇర‌కాటంలో కాట‌మ‌రాయుడు

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా లాంఛ‌నంగా మొద‌లైంది. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు ప‌నిలో ఉన్నాడు ప‌వ‌న్‌. ఈలోగా కొత్త సినిమాకి కొబ్బ‌రికాయ్ కొట్టారు. కాట‌మ‌రాయుడు ప‌నులే.. నిదానంగా మ‌రీ గూడ్స్ బండి రైలుగా స్లోగా న‌డుస్తుంటే.. కొత్త సినిమా లంకెనీ త‌గిలించుకొన్నాడు ప‌వ‌న్‌. ఈ సినిమాకి డిసెంబ‌రు నుంచి కాల్షీట్లు ఇచ్చిన‌ట్టు టాక్‌. డిసెంబ‌రులో 15 రోజులు షూటింగ్ జ‌రిపి.. జ‌న‌వ‌రిలో నిర‌వ‌ధికంగా రెండు షెడ్యూల్స్ తో ముగించాల‌ని ప్లాన్ చేస్తున్నార్ట‌. అంతా బాగానే ఉంది. మ‌రి త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడు? త్రివిక్ర‌మ్ కూడా ప‌వ‌న్ కోస‌మే మ‌రో సినిమా ఒప్పుకోకుండా ఇన్నాళ్లూ ఎదురుచూశాడు. డిసెంబ‌రు నాటికి స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్దం చేసుకొని. జ‌న‌వ‌రి నుంచి రంగంలోకి దిగిపోవాల‌ని ప్లాన్ చేశాడు. తీరా చూస్తే నేస‌న్ సినిమాని ట్రాక్ ఎక్కించాడు ప‌వ‌న్‌. త్రివిక్ర‌మ్, నేస‌న్ సినిమాలు రెండూ ఒకేసారి చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటాయ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్‌కి అంత టైమ్ ఉందా?? ఒక‌సారి ఒక సినిమాపై దృష్టి పెట్ట‌డానికే ప‌వ‌న్ కిందా మీదా ప‌డిపోతుంటే.. ఒకేసారి రెండు సినిమాల్ని ఒప్పుకొంటాడా?? త‌న 20 ఏళ్ల కెరీర్‌లో ప‌వ‌న్ ఎప్పుడూ ట్రై చేయ‌ని ఫీట్ ఇది. ఇప్పుడు.. అదీ పొలిటిక‌ల్ గా బిజీ అవుదామ‌నుకొంటున్న త‌రుణంలో ఒకేసారి రెండు సినిమాలు చేస్తాడా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ప‌వ‌న్‌కి కాట‌మ‌రాయుడుపై ఇంట్ర‌స్ట్ లేద‌ని, ఆ సినిమాని ఏదోలా వ‌దిలించుకోవాలని చూస్తున్నాడ‌న్న టాక్స్ ఎక్కువ‌వుతున్నాయి. ఓ వైపు షూటింగ్ జ‌రుగుతున్నా అది అడ‌పా ద‌డ‌పా వ్య‌వ‌హార‌మే అని… ప‌వ‌న్‌పై తీసిన సీన్లు ప‌ట్టుమ‌ని రెండు కూడా లేవ‌ని తెలుస్తోంది. తాజాగా నేస‌న్ సినిమాని ట్రాక్ ఎక్కించ‌డం చూసిన వాళ్ల‌కెవ్వ‌రికైనా…. కాట‌మ రాయుడు ప‌రిస్థితేంటి?? అనే డౌటు రావ‌డం ఖాయం. అయితే.. కాట‌మ‌రాయుడు యూనిట్ మాత్రం.. ”మా సినిమా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉంటుంది. శ్రుతి కాల్షీట్లు స‌ర్దుబాటు కాక‌ షూటింగ్ ఆల‌స్యం అవుతోందంతే” అని స‌మాధానం ఇస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న పొజీష‌న్‌లో డిసెంబ‌రులోగా కాట‌మ‌రాయుడు పూర్త‌యితే గొప్పే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close