ఎక్స్‌క్లూజీవ్‌: ప‌వ‌న్ సినిమా కోసం తాజ్‌మ‌హ‌ల్‌, చార్మినార్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఈరోజే కొబ్బ‌రి కాయ కొట్టుకుంది. పిబ్ర‌వ‌రి 4 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. మొగ‌లాయిల పరిపాల‌నా కాలం నాటి క‌థ ఇది. ఆనాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా సెట్స్ అవ‌స‌ర‌మ‌య్యాయి. ముఖ్యంగా తాజ్ మ‌హ‌ల్‌, చార్మినార్ సెట్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించ‌బోతున్నాయి. అవి రెండూ సెట్స్‌గా తీర్చిదిద్ద‌బోతున్నారు. కేవ‌లం సెట్స్ కోస‌మే 20 కోట్ల వ‌ర‌కూ బ‌డ్జెట్ కానున్న‌ద‌ని స‌మాచారం. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలోనూ కొన్ని సెట్స్‌ని రూపొందిస్తున్నారు. తొలి షెడ్యూల్ అక్క‌డే జ‌ర‌గ‌బోతోంది. అప్ప‌టి మ‌హ‌మ్మ‌దీయుల క‌ట్ట‌డాల‌న్నీ దాదాపుగా తెర‌పై చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈసినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ దొంగ‌గా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు చోటుంది. అందులో ఒక‌రిని బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేస్తారు. ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం కూడా బాలీవుడ్ న‌టుడినే ఎంచుకునే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close