శంకరాభరణం టీజర్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్

నిఖిల్, నందిత జంటగా నటిస్తున్న ‘శంకరాభరణం’ సినిమా టీజర్ నిన్న విడుదలయింది. ఈ సినిమాని చాలా లో-బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. కనుక అందుకు తగ్గట్టుగానే టీజర్ విడుదల చాలా సింపుల్ గా కానీ చాలా వెరైటీగా చేసారు. ఈ సినిమాకి కధ అందించిన ప్రముఖ రచయిత కోన వెంకట్ అభ్యర్ధనను మన్నించి పవన్ కళ్యాణ్ తన సినిమా సెట్స్ లోనే ఈ టీజర్ ని విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ అంత పెద్ద హీరో ఏమాత్రం బేషజం లేకుండా తన సినిమా సెట్స్ లోనే వేరొక చిన్న సినిమా టీజర్ ని విడుదల చేసి తన ఔనత్యాన్ని మరోమారు చాటుకొన్నారని హీరో నిఖిల్ ట్వీటర్ లో పవన్ కళ్యాణ్ పై ప్రశంశలు కురిపించారు. నిఖిల్ తన ఆనందం వ్యక్తం చేస్తూ, “ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్ని సర్దార్ సెట్స్ మీద కలుసుకొన్నాను. నా ఆనందాన్ని కొద్దిపాటి మాటలలో వ్యక్తం చేయలేను. అంత గొప్ప, అంత పెద్ద నటుడు అంత నిరాడంబరంగా అంత మర్యాదగా వ్యవహరించడం చూస్తుంటే నమ్మలేకపోయాను. టీజర్ రిలీజ్ చేసిన తరువాత పవన్ కళ్యాణ్ నన్ను ఆప్యాయంగా కౌగలించుకొన్నారు. నా ఆనందాన్ని మాటలలో చెప్పలేను. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి కేవలం ‘థాంక్స్’ అనే పదం ఒక్కటే సరిపోదు,” అని ట్వీట్ నిఖిల్ చేసారు.

ఈ సినిమాకి కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం సినిమాకి ఒక్క పేరులో తప్ప మరేవిధంగా సంబంధం, పోలికా లేదు. ఈ కొత్త శంకరాభరణం సినిమా బీహార్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన కామెడీ క్రైం థ్రిల్లర్. ఈ సినిమాతో ఉదయ్ నందనవనం దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎం.వి.వి. బిల్డర్స్ అధినేత ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సరికొత్త ‘శంకరాభరణం’లో అంజలి అతిధి పాత్రలో, సంపత్ రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

[youtube http://www.youtube.com/watch?v=4Oohz_ySuCE&w=853&h=480]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close