పవన్ సినిమాలో చేయమని ఎవరూ సంప్రదించలేదు: ఆలీ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్ నటించిన పింక్ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆలీ కూడా నటిస్తున్నాడు అని గత కొద్ది రోజులు గా సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల సందర్భంలో పవన్ కళ్యాణ్ పై మాటల తూటాలు పేల్చిన ఆలీ మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా లో నటిస్తాడా అన్న చర్చ జరుగుతుండగానే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అలీ. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్కళ్యాణ్ సినిమా లో ఆఫర్ తో ఎవరు తనను ఇప్పటి వరకు సంప్రదించలేదని ఆలీ చెప్పుకొచ్చారు. ఒకవేళ సంప్రదిస్తే నటిస్తారా అన్న ప్రశ్న పై కూడా స్పందించారు . వివరాల్లోకి వెళితే..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలో నటించిన చాలా సినిమాల్లో అలీ నటించారు. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో ఆలీ తనకు మంచి మిత్రుడని సభాముఖంగా తెలియజేశారు. ఆలీ లేకుండా సినిమాలు చేయలేవా అని తన తల్లి అడిగారని కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్లో వ్యాఖ్యానించారు. అయితే ఆలీ జనసేన లోకి చేరుతాడేమో అనుకుంటే, ఆయన జనసేనలో చేరకుండా ఒకే సమయంలో అటు వైఎస్సార్సీపీతో పాటు చంద్రబాబుతో మంతనాలు జరిపారు. టిడిపిలో చేరడానికి సిద్ధం అన్న సిగ్నల్స్ పంపించి, తన సన్మాన కార్యక్రమాని కి ముఖ్య మంత్రి గా ఉన్న చంద్రబాబు నాయుడు హాజరయ్యేలా చేసుకున్నారు. మరుసటి రోజు వెళ్లి వైఎస్సార్సీపీతో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీల తో చర్చలు జరిపాక తీరిక గా వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. తన తో పాటు సంవత్సరాల తరబడి ప్రయాణం చేసే వాళ్ళని మాత్రమే చేర్చుకోవాలని ఉద్దేశమో, మరేమో కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆలీ ని జనసేన లో చేరమని తనకు తానుగా ఆహ్వానించలేదు. మొదట లో, తనకు ఏ పార్టీ మంత్రి పదవి ఖాయం చేస్తే ఆ పార్టీలో చేరతానని వ్యాఖ్యలు చేసిన అలీ, చివరికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సిపి లో చేరిపోయారు. ఆ తర్వాత రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన చేత సాయం పొందిన స్నేహితులు కూడా తన వెంట లేకపోయినప్పటికీ అభిమానులు ఎల్లప్పుడూ తన వెంట ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఆలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కంటే ముందు నుండే తాను సినిమాల్లో ఉన్నానని, తనకు ఏ రకంగా సాయం చేశారో పవన్ కళ్యాణ్ చెప్పాలని, తనకు వచ్చిన అవకాశాలు తన టాలెంట్ ని బట్టి వచ్చాయని ఇలా ఏవేవో మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మిత్రభేదం ఉందన్న అభిప్రాయం కలిగింది.

ఇప్పుడు పింక్ రీమేక్ సందర్భంగా, ఆలిని తన సినిమాలో నటించమని పవన్ కళ్యాణే స్వయంగా అడిగారు అంటూ వచ్చిన వార్తలు ఒక సెక్షన్ మీడియా సృష్టించిన వార్తలే అని తేటతెల్లమైంది.  ఈ సినిమాలో చేయమని ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదని ఆలీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఎవరైనా సంప్రదిస్తే మాత్రం తప్పకుండా నటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని, కాబట్టి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఆలీ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మాత్రం ఆలీ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. కేవలం కొంత మంది ఫ్యాన్స్ మాత్రం ఇద్దరూ కలిసి నటిస్తే మళ్లీ బాగుంటుందని అభిప్రాయపడుతున్నప్పటికీ, మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం, చాలా కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ మీద దురుసు వ్యాఖ్యలు చేసి, ఆయనకు నష్టం కలిగించిన ఆలీ తో పవన్ తిరిగి నటించాలని తాము కోరుకోవడం లేదని అంటున్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అయ్యుండొచ్చు గాని, మనుషులు భావోద్వేగాలు మాత్రం ఒకటే కదా అని వారు గుర్తు చేస్తున్నారు. 

ఏది ఏమైనా, ఆలీ నటించకపోయినంత మాత్రాన పింక్ రీమేక్ సినిమాకి వచ్చే నష్టం ఉండదు. అదే సమయంలో, పవన్ సినిమాలో నటించనంత మాత్రాన ఆలీ కి కలిగే నష్టం ఉండదు. ఇప్పటికే ఆలీ వేల కోట్లు సంపాదించుకున్నాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆస్తి ఆలీ కలిగి ఉన్నాడు. బహుశా అందుకే పవన్ కళ్యాణ్ చిన్న విమర్శ చేస్తే దానికి ఎన్నో రెట్లు పెద్ద విమర్శలు పవన్ కళ్యాణ్ పై ఆలీ చేశాడు. ఏది ఏమైనా ఒకసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఎంతో ఆప్తమిత్రులు సైతం దూరం అవుతారు, కొనియాడిన నోటితోనే తిట్ల వర్షాలు కురిపిస్తారు అన్న దానికి పవన్ కళ్యాణ్ ఆలీ ల ఉదంతం మరొక నిదర్శనం. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close