షాకింగ్ న్యూస్‌: ప‌వ‌న్ సినిమా చేస్తున్నాడా?

రాజ‌కీయ‌ల కోసం సినిమాల‌కు దూర‌మ‌య్యాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. బ‌హిరంగ వేదిక‌ల‌పై కూడా `మీ స‌మ‌స్య‌ల్ని చూసి త‌ట్టుకోలేకే… సినిమాలు వ‌దిలేసి మీ మ‌ధ్య‌కు వ‌చ్చాను` అని చెవులు చిల్లులు ప‌డేల స్పీచులు ఇస్తున్నాడు. ప‌వ‌న్ అభిమానులు, చిత్ర‌సీమ కూడా 2019 అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌కూ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సినిమాలు చేయ‌డ‌న్న అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ప‌వ‌న్ ఇప్పుడు ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడ‌ని టాక్‌. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, తెర వెనుక త‌తంగం అంతా ఆయ‌నే ద‌గ్గ‌రుండి న‌డిపిస్తున్నార‌ని స‌మాచారం.

అయితే ఈ సినిమాలో మ‌రో క‌థానాయ‌కుడు ఉంటాడ‌ట‌. ప‌వన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని, ద్వితీయార్థంలో ప‌వ‌న్ రోల్ కీల‌కం అవుతుంద‌ని, ఓ ర‌కంగా ప‌వ‌నే ఇందులో హీరో అని తెలుస్తోంది. ఇదో పొలిటిక‌ల్ డ్రామా అని, రాజ‌కీయంగా ఈ చిత్రం ప‌వ‌న్‌కి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఉద్దేశంతోనే రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌ని, ప‌వ‌న్ కూడా ఇందుకు అంగీక‌రించాడ‌ని, స్క్రిప్టు సిద్ధ‌మైంద‌ని, ఈ చిత్రంలో మ‌రో క‌థానాయ‌కుడిగా మెగా హీరోనే న‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందుతోంది. మ‌రోవైపు మైత్రీ మూవీస్ కూడ ప‌వ‌న్ రాక‌కోసం ఎదురుచూస్తోంది. ప‌వ‌న్ కి ఇది వ‌ర‌కే మైత్రీ అడ్వాన్స్ ఇచ్చింది. మ‌రి ఈ సినిమాని మైత్రీ సౌజ‌న్యంతో పూర్తి చేస్తారా, లేదంటే రామ్ తాళ్లూరినే సోలోగా నిర్మిస్తారా.. అనేది చూడాలి. `ప్ర‌జా సేవ కోస‌మే సినిమాలు మానేశా` అని చెబుతున్న ప‌వ‌న్‌… త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డం నిజంగా షాకింగే అయినా… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి మాత్రం ఇంత‌కంటే గుడ్ న్యూస్ మ‌రోటి ఉండ‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com